Tuesday, December 24, 2024

పూర్ణిమ గా దివ్యా పిళ్లై ఫస్ట్ లుక్

లీడ్ యాక్టర్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లను రిలీజ్ చేసిన తర్వాత ‘భైరవం’ మేకర్స్ ఇప్పుడు ఫీమేల్ లీడ్ పాత్రలపై దృష్టి పెట్టారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. భైరవం ఇప్పటికే స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో దివ్యా పిళ్లై ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమెను బంగారు బొమ్మ “పూర్ణిమ”గా పరిచయం చేశారు. పోస్టర్ లో దివ్యా పిళ్లై ట్రేడిషనల్ శారీలో బ్యూటీఫుల్ గా కనిపించారు. ఫస్ట్ లుక్ లో నిజంగానే బంగారు బొమ్మలా ఆకట్టుకున్నారు. ఛార్మింగ్ స్మైల్ లో ఆమె ప్రజెన్స్ అందరినీ అలరించింది.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com