Friday, November 15, 2024

పెళ్ళి చేస్తే కలిసుంటారా?

– నాగచైతన్య పెళ్ళిపై నాగ్‌ అనుమానాలు
– ప్రముఖ జ్యతిష్యుడితో మంతనాలు
-వేణుస్వామి వ్యాఖ్యలపై అమోమయం

సినిమావాళ్ళంటేనే సెంటిమెంట్‌. ఏ పని మొదలు పెట్టినా వాళ్ళు సెంటిమెంట్‌ని ఫాలో అవుతారు. మంచి రోజు, మంచి ముహూర్తం ఇలా రక రకాలు చెక్‌ చేసుకుని మరీ సినిమాలు తీస్తుంపటారు. ఇక ఆ సినిమాలు హిట్లు.. ఫ్లాపుల సంగతి పక్కన పెడితే. నిజ జీవితంలో కూడా వీరు చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి ఇప్ప‌డు హాట్ టాపిక్‌గా మారింది. నాగచైత‌న్య‌, సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో కొంత‌కాలం డేటింగ్‌లో ఉన్నారు. అయితే, ఇటీవ‌లే వీరిద్ద‌రూ కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం చేసుకున్న విష‌యం తెలిసిందే. అప్ప‌టినుంచి నాగ‌చైత‌న్య‌, శోభిత గురించి చిన్న వార్త వ‌చ్చినా నెట్టింట్లో మాత్రం వైర‌ల్‌గా మారుతుంది. ఇక, వీరిద్ద‌రి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4న జరగనున్నట్లు కూడా వార్త‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే, దీనిపై ఎటువంటి అధికారిక స‌మాచారం లేదు. ఇప్ప‌డు మ‌రో వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. కొడుకు నాగ‌చైత‌న్య కోసం నాగార్జున ఓ ప్ర‌ముఖ జ్యోతిష్యుడిని క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. నాగ‌చైతన్య, శోభితల ఎంగేజ్‌మెంట్ జరిగిన మ‌రుస‌టి రోజు ప్రముఖ జ్యోతిష్యుడు, వివాదాల కేరాఫ్‌గా నిలిచిన వేణు స్వామి వీరిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. వీళ్లిద్దరు 2027 వ సంవత్సరంలో విడిపోతారు అంటూ షాక్ న్యూస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అక్కినేని కుటుంబంతో పాటు ఆయ‌న అభిమానులు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై వేణుస్వామి మీద ఫిల్మ్ జర్నలిస్టుల సంఘం మహిళా కమీషన్‌కి కూడా ఫిర్యాదు చేసింది. ప్ర‌ముఖ జ్యోతిషుడు వేణు స్వామి పై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు ప్ర‌క్రియ ప్రారంభించారు. అయితే, గ‌తంలో నాగ‌చైత‌న్య, స‌మంత పెళ్లి జ‌రిగిన‌ప్పుడు కూడా వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం నిజ‌మ‌య్యింది. దీంతో ఇప్ప‌డు కూడా అలా మాట్లాడ్డంతో నాగ‌చైత‌న్య విషయంలో నాగార్జున కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే నాగార్జున రీసెంట్‌గా ఒక ప్రముఖ జ్యోతిష్యుని క‌లిసారు. ఇక మరి ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు.. నాగ్‌ కలిసింది నిజమేనా అన్న విషయాల పై క్లారిటీ రావలసి ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular