Sunday, January 5, 2025

ప్రభాస్‌తో నాకు సంబంధమా?

టాలీవుడ్ డార్లింగ్‌ అంటే గుర్తొచ్చేది ఎవరు… బాహుబలి ప్రభాస్. మరి ఆయనంటే క్రేజ్‌ లేని అమ్మాయిలు ఎవరన్నా ఉంటారా అంటే.. ఉండనే ఉండరు. కేవలం మాములు ప్రేక్షకులే కాదండోయ్‌ మన ప్రభాస్‌కి సెలబ్రెటీలు కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్‌ షర్మిల మధ్య సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వైఎస్ షర్మిల తొలిసారిగా నోరు విప్పారు. ప్రభాస్‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేదని స్పష్టంచేసిన ఆమె, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ అసత్య ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. దీనికి బాధ్యతలైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సీపీ అంజని కుమార్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ…2014 ఎన్నికలకు ముందు తనకు, ప్రభాస్‌తో సంబంధం ఉందని అసత్య ప్రచారం చేశారని గుర్తు చేశారు. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే అప్పట్లో ప్రచారం ఆగినా… ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు ముందు తనపై మరోసారి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అసత్య ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించిన ఆమె…దీని వెనకాల ఎవరున్నా సరే వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీని కోెరినట్లు షర్మిల తెలిపారు. ఆడవాళ్ల మీద జరుగుతున్న దుష్ప్రచారాలపై కూడా ఫిర్యాదు చేశానన్నారు. కనీసం మానవత్వం లేకుండా ఈ విధంగా దుష్ప్రచారం చేయడం సరియైనది కాదన్నారు. వెబ్ సైట్, సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఎవరు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఒక తల్లి గా చెల్లి గా నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్న షర్మిల… గౌరవం కాపాడుకోవాలని బయటకు వచ్చి ఫిర్యాదు చేశానన్నారు.
తాను ఇప్పటివరకు ప్రభాస్‌ను కలవలేదన్నారు. పిల్లల మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను…పుకార్ల పుట్టించి క్యారెక్టర్ ను దెబ్బ తీసే విధంగా ప్రచారం చేయడంతో చాలా మంది నా వాళ్ళు బాధపడ్డారన్నారు. ఈ సోషల్ మీడియా జరిగిన ఈ ప్రచారంలో కొంచం కూడా నిజం లేదన్నారు. దీనివెనుక తెలుగు దేశం పార్టీ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేనందునే… తెలంగాణలో ఫిర్యాదు చేశామన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com