Thursday, January 9, 2025

ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ స్టోరీల్లో లీడ్ రోల్స్ చేస్తున్నాడు – విజయ్ దేవరకొండ

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నారు. ఈ రోజు సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ”నా బ్రదర్ దర్శి (ప్రియదర్శి)తో నా కెరీర్ స్టార్ట్ చేశా. ఇంట్రెస్టింగ్ కథల్లో లీడ్ రోల్స్ చేస్తూ మనకు మంచి సినిమాలు అందిస్తున్నాడు. అతను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘సారంగపాణి జాతకం’ టీజర్ ఇప్పుడే చూశాను. అందులో… దర్శి పాత్రకు జాతకాల మీద నమ్మకం ఉంటుంది. జాతకాలు ఎంత నిజం అనేది నాకు తెలియదు. ‘పెళ్లి చూపులు’ చేసినప్పుడు మేం ఈ స్థాయికి వస్తాం అని ఊహించలేదు. డెస్టినీ మమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చింది. దర్శి జర్నీ చూడటం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ‘సారంగపాణి జాతకం’ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి గారు దర్శకత్వం వహించారు. ఆయన ‘అష్టా చమ్మా’ సినిమా చూసి నేను ఎంత నవ్వుకున్నానో చెప్పలేను. అప్పట్లో అది చాలా డిఫరెంట్ కంటెంట్. ఆ మూవీని చాలా ఎంజాయ్ చేశా. అలాగే, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ గారు ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నారు. ఎన్నో మంచి సినిమాలు చేశారు. ‘సారంగపాణి జాతకం’ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మోహనకృష్ణ ఇంద్రగంటి గారికి, శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.

ఇక ‘సారంగపాణి జాతకం’ టీజర్ విషయానికి వస్తే… హీరో జాతకాలను బాగా నమ్ముతాడు. ‘మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది’ అని చెబుతాడు. ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు, నిజమైన రోజు చుట్టుపక్కల ఎవరున్నారు? ఏం అవుతుంది? అనేది పట్టించుకోకుండా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తం చేసే యువకుడు. మరి, ఆ జాతకాలపై అమితమైన నమ్మకం వల్ల అతని జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లికి సిద్ధమైన మండపంలో ఒకరిని సారంగపాణి ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు? నరేష్ ను ఎందుకు కత్తితో పొడిచాడు? అది నిజమా? కలా? అతని జీవితంలో కీచకుడు ఎవరు? కీచకుడిగా తనికెళ్ళ భరణి ఎటువంటి క్యారెక్టర్ చేశారు? సుందరమ్మ మరణిస్తే హీరో ఎందుకు హ్యాపీగా ఫీలయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు డిసెంబర్ 20న థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలి. శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, హర్ష చెముడు వినోదం అందర్నీ నవ్విస్తుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

‘మొత్తం మనిషిలో ఆ ఒక్క పార్ట్ గుర్తుందా ఈవిడకి’ – ‘బీ కార్పొరేట్, నాట్ డెస్పరేట్’ అని ‘వెన్నెల’ కిశోర్ చెప్పే డైలాగ్స్ నవ్వించాయి. ‘సారంగం అని ధనుస్సు చేతిలో ఉన్నవాడు సారంగపాణి’, ‘నా దగ్గర విరుగుడు మంత్రాలు, పూజలు, తాయత్తులు ఉండవు’ అని శ్రీనివాస్ అవసరాల, ‘నాలాంటి ప్రాక్టికల్ మనిషికి ఇలాంటి జాతకాల పిచ్చోడు కొడుకుగా ఎలా పుట్టాడే’ అని తండ్రి పాత్రలో వడ్లమాని శ్రీనివాస్, ‘నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్’ అంటూ హీరో పదేపదే చెప్పే మాట కథపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి.

ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

 

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com