- సాయిబాబా మృతికి సంతాపాన్ని ప్రకటించిన మావోయిస్టు పార్టీ
- లేఖ విడుదలచేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్
హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచిన పౌర హక్కుల నేత, ప్రజాస్వామిక వాది, రచయిత, మేధావి ప్రొపెసర్ జీఎన్ సాయిబాబాకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ మావోయిస్టుపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. సాయిబాబా ఆశయాలను, ఆదర్శాలను. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధు మిత్రులు తన వారసులుగా కొనసాగించాలని మంగళవారం మావోయిస్టు పార్టీ రాష్ట్ర అదికార ప్రతినిధి లేఖలో పేర్కొన్నారు. పౌర హక్కులను పరిరక్షించడానికి ప్రజల తరపున గొంతెత్తిన సాయిబాబాను బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు రాజ్యమే.. పథకం ప్రకారం హత్య చేసిందని ఆరోపించారు. దిల్లీ ప్రొఫెసర్‌గా కొనసాగుతూ మలి దశ తెలంగాణ ఉద్యమానికి మార్గనిర్దేశం చేశారు. 1997 డిసెంబర్ లో ఏఐపిఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ కోసం రెండు రోజుల సదస్సు జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఈ సభలోనే వరంగల్ డిక్లరేషన్ జరిగింది. ఆ సదస్సుకు జీఎన్ సాయిబాబా నాయకత్వం వహించారు.
ఆలిండియా పీపుల్స్ రిసిస్టెన్స్ ఫోరం (ఏఐపిఆర్‌ఎఫ్) All India People’s Resistance Forum (AIPRF) లో కొనసాగుతూ ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పోరాటం చేశారని తెలిపారు. ఫోరం ఎగనెస్ట్ వార్ ఇన్ పీపుల్స్ వేదికలో క్రియాశీలంగా పనిచేస్తూ, సామ్రాజ్యవాదుల, కార్పొరేట్ల సంస్థల ప్రయోజనాల కోసం దేశ సంపదను, ప్రాకృతిక వనరులను కొల్లగొట్టడానికి దేశ ప్రజలపై, ప్రధానంగా ఆదివాసీ ప్రజలపై సల్వాజుడుం, గ్రీన్ హంట్ పేర్లతో సాగుతున్న పాశవిక దాడులను నిర్ధాక్షిణంగా ఖండిరచిన వ్యక్తి సాయిబాబా అని లేఖలో తెలిపారు. దేశంలో పాశవికంగా కొనసాగుతున్న రాజ్య హింసను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రజాస్వామిక బద్ధంగా ప్రశ్నించడం, ప్రశ్నించే శక్తులను తయారు చేయడం నేరంగా భావించిన రాజ్యం కుట్రపూరితంగా, మానవ హక్కులను ఉల్లంగిస్తూ పెగాసస్ వంటి మాల్వేర్స్ సాప్ట్ వేర్ల ద్వారా జీఎన్ సాయిబాబా కంప్యూటర్‌లో చొరబడి అందులో మావోయిస్టు సాహిత్యాన్ని చూపించి మావోయిస్టులతో సంబంధాలు కలిగి వున్నాడని నిందారోపణ చేసి రాజ్యంగ విరుద్ద చట్టాలను అక్రమంగా మోపారని లేఖలో విమర్శించారు. నిర్దోషిని, 90 శాతం అంగవైకల్యంతో కదలేని స్థితిలో వీల్ చైర్ లో ఒకరి మద్దుతు లేకుండా తన పని తాను చేసుకోలేని స్థితోలో వున్న జీఎన్ సాయిబాబాను అన్యాయంగా పదేళ్ల పాటు ఒంటరిగా సెల్ లో నిర్బంధించారు.
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా జైలులో ఎలాంటి వైద్య సౌకర్యాలు అందకుండా చేశారు. చివరి దశలో నిర్ధోషిగా నిరూపించబడి విడుదల చేయాలని మహారాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఆ తీర్పును సవాల్ చేస్తూ హిందుత్వ శక్తులు ఎన్‌ఐఏ తన విడుదలను అడ్డుకుంది. జైలులో దుర్భర పరిస్థితులను కల్పించి తన ఆరోగ్యాన్ని క్షీణించేలా చేశారు. మరణానికి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలే పూర్తి బాధ్యత వహించాలి. జీఎన్ సాయిబాబా పది సంవత్సరాలు అండ సెల్ ఒంటరిగా దుర్భర జీవితాన్ని అనుభవించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దృఢ దీక్షతో చీకటి అమానవీయ చర్యలను ఎదుర్కొన్నారు. ఫాసిస్టు పాలకులు ఎన్ని మానసిక చిత్రహింసలు పెట్టినప్పటికీ తాను ఏనాడు రాజీ పడలేదు. జైలులో ఖైదీల హక్కుల కోసం ధైర్యంగా పోరాడారు. అత్యంత ధైర్యశాలి మొక్కవోని ధైర్యంతో రాజ్యాన్ని ప్రశ్నించిని ప్రజాస్వామిక వాదికి, బుద్ధి జీవికి, అంగవైకాల్యన్ని లెక్క చేయని నిస్వార్థ నిలబడిన ప్రజల పక్షపాతికి మరోసారి తెలంగాణ రాష్ట్ర కమిటీ తలవంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తుందని జగన్ లేఖలో తెలిపారు.