Tuesday, December 24, 2024

ఫోన్ ట్యాపింగ్ కింగ్స్‌

మ‌రో ముగ్గురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే
ఇప్ప‌టికే న‌లుగురికి నోటీసులు..?
త్వ‌ర‌లోనే విచార‌ణ‌

రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క ఆధారాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. మ‌రో న‌లుగురు రాజ‌కీయ నేత‌ల‌కు… ఈ కేసు విచార‌ణ బృందం నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. ముగ్గురు మాజీ మంత్రులు, మ‌రో మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే, వీరిలో ఉమ్మ‌డి న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన నేత‌లే ఉండ‌టంతో.. మ‌రింత మంది నేత‌ల‌కు భ‌యం ప‌ట్టుకున్న‌ది. నిజానికి, ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ కథంతా నడుస్తుండగా, అతను నగరానికి వస్తేనే ముందడుగు ప‌డుతుంద‌ని భావించారు. కానీ, సోమవారం ఏకంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు పంపారు. ఆయ‌న విచార‌ణ‌కు రాలేన‌ని, ఈ నెల 14న వ‌స్తాన‌ని రిప్లై కూడా ఇచ్చారు. దీనికి కొన‌సాగింపుగా మ‌రో న‌లుగురికి కూడా నోటీసులు వెళ్లిన‌ట్లు తెలుస్తున్న‌ది.

ఇప్పుడు రాలేను.. ప్లీజ్‌
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నిందితుడైన తిరుపతన్నతో జరిగిన ఫోన్ సంభాషణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చిరుముర్తి లింగ‌య్య‌ను పోలీసులు విచారణకు పిలిచారు. కానీ, తనకు ఆరోగ్యం బాగాలేదని, ఇప్పుడు విచారణకు రాలేనంటూ లింగయ్య.. పోలీసులకు తెలిపారు. ఈనెల 14న హాజరయ్యేందుకు రిక్వెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటిదాకా అధికారులను మాత్రమే టచ్ చేసిన‌ పోలీసులు… ఓ రాజకీయ నేతకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

ఈ న‌లుగురికి కూడా..?
ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది బీఆర్ఎస్ లీడర్లకు సంబంధాలు ఉన్నాయని విచార‌ణ‌లో తేలింది. కేసులో నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న స్టేట్మెంట్ల ఆధారంగా పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేసి సమాచారం సేకరించారని, దాన్ని బీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా వాడుకున్నారని తెలుసుకున్నారు. అందుకే ప్రణీత్ రావు ఆధారాలు దొరకకుండా హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్టుగా గుర్తించారు.
విచార‌ణ సంద‌ర్భంగా మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాలకుర్తిలో, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో వార్ రూమ్ ల‌ను ప్ర‌ణీత్‌రావు ఏర్పాటు చేశాడు. ఎర్రబెల్లికి పోటీగా నిలబడిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినీ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశాడు. ఒక్క పాలకుర్తిలోనే కాదు, ఇతర ప్రాంతాల్లోనూ ప్రణీత్ రావు వార్ రూమ్స్ ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ నేతల మూవ్‌మెంట్స్ తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను గట్టిగా వాడేశారు. అప్పటి ప్రతిపక్ష నేతలు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవర్ని కలుస్తున్నారు, ఇలా సమాచారమంతా తెలుసుకుంటూ కథంతా నడిపించారు. మహబూబ్ నగర్, నల్గొండ కాంగ్రెస్ నేతల ఫోన్స్ ట్యాప్ చేసేందుకు నల్గొండలోని ఓ ఉడిపి హోటల్‌పైన పెట్టిన వార్ రూమ్‌ను ప్రభుత్వం మారాక కూడా కొనసాగించారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌కు కీలక సమాచారం వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూరల్ బెల్ట్‌పై ఫోకస్ చేసిన పోలీసులు, ఈ ముగ్గురు మాజీ మంత్రులతో పాటుగా న‌ల్గొండ జిల్లాకు చెందిన మ‌రో మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చిన‌ట్లు తెలుస్తున్న‌ది.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com