Wednesday, December 25, 2024

బెయిల్ ఇవ్వ‌లేం – న‌టి కస్తూరికి మధురై కోర్టు బిగ్ షాక్‌

సినీ నటి కస్తూరికి బిగ్ షాక్ తగిలింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మధురై కోర్టు నిరాకరించింది. ఆమె వేసిన పిటిషన్ ను సైతం కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కస్తూరి పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు, తమిళులను వేరు చేసి ఎలా మాట్లాడతారని ఫైర్ అయ్యింది. కోర్టు పిటిషన్ కొట్టివేయడంతో కస్తూరి అరెస్ట్ కు రంగం సిద్దమైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న కస్తూరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కస్తూరి పై పలు తెలుగు సంఘాలు ఆమెపై ఫిర్యాదు చేశాయి. ఆమెను సమన్లు ఇచ్చేందుకు పోలీసులు చెన్నైలోని ఆమె ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. దాంతో కస్తూరి అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. తమిళనాడులోని తెలుగు మాట్లాడే ప్రజలు 300 ఏళ్ల క్రితం రాజులకు సేవ చేసేందుకు వచ్చిన వేశ్యల వారసులని, ఇప్పుడు తాము తమిళ మూలానికి చెందినవారమని చెప్పుకుంటున్నారని ఆరోపిస్తూ కస్తూరి గత వారం చెన్నైలో జరిగిన బ్రాహ్మణ సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు. ఆమె వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com