Sunday, December 29, 2024

బెయిల్‌ రద్దు పిటీషన్‌ కొట్టివేత

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎవరో ఒకరిపైన లైంగిక వేధింపుల పై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు ఇలాంటివి బయటకు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు అలాంటివేమి లేవు. ఎటువంటివారైనా సరే నిరభ్యంతరంగా ధైర్యంగా బయటకు వచ్చి వారికి జరిగిన అన్యాయం గురించి కుండబద్ధలు కొట్టి మరీ చెబుతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు అక్టోబర్ 24న తెలంగాణ హైకోర్టు బెయిలు ఇచ్చింది. ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమంటూ జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ సతీశ్‌చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com