Tuesday, December 3, 2024

బేబి జాన్‌ ‘నయన్‌ మటక్క’

బేబీ జాన్‌ మూవీ నుంచి ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్‌ రిలీజ్‌కి రెడీ అయింది. ఈ నెల 25న నయన్‌ మటక్క పాటను విడుదల చేయడానికి సర్వ సన్నాహాలు జరుగుతున్నాయి. బేబీ జాన్‌ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచీ, టీజర్‌ విడుదలైనప్పటి నుంచీ ఎక్స్ పెక్టేషన్స్ మామూలుగా లేవు. మురద్‌ ఖేతాని, ప్రియా అట్లీ, జ్యోతీ దేశ్‌పాండే నిర్మిస్తున్న సినిమా బేబీ జాన్‌. అల్టిమేట్‌ డ్యాన్స్ ఆంథమ్‌గా నయన్‌ మట్కా ఉండబోతోందని చెప్పారు మేకర్స్. దిల్జిత్‌ దోసంజ్‌, దీక్షిత వెంకడేశన్‌ అలియా ఢీ కలిసి ఆలపించారు. ఇర్షద్‌ కమిల్‌ సాహిత్యం అందించారు. ఎస్‌.తమన్‌ సంగీతం అందించారు. నయన్‌ మటక్క ట్రాక్‌ ఫుట్‌ ట్యాపింగ్‌గా ఉండబోతోంది. ఈ పాటలో వరుణ్‌ ధావన్‌ – కీర్తీ సురేష్‌ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ అదుర్స్ అనే టాక్‌ ఆల్రెడీ స్ప్రెడ్‌ అయింది. దిల్జిత్‌ వాయిస్‌.. ఆ ఎలక్ట్రిఫైయింగ్‌ బీట్‌లో మరో రేంజ్‌లో ఉంటుందనే టాక్‌ కూడా మొదలైంది. ఆస్ట్రేలియన్‌ సింగర్‌గా, కంపోజర్‌గా పేరు ప్రఖ్యాతలున్న ఢీ ఈ సినిమాలోని పాటకు మేజిక్‌ యాడ్‌ చేశారు.

బేబీ జాన్‌లో వరుణ్‌ ధావన్‌, జాకీ ష్రాఫ్‌, వామికా గబ్బి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతోనే కీర్తీ సురేష్‌ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. మేకింగ్‌ సమయం నుంచే ట్రూ బ్లాక్‌ బస్టర్‌ అనే ఫీల్‌ క్రియేట్‌ చేసింది బేబీ జాన్‌. ఈ సినిమాను జియో స్టూడియోస్‌, అట్లీ, సినీ 1 స్టూడియోస్‌తో కలిసి సమర్పిస్తోంది. ఎ ఫర్‌ యాపిల్‌ స్టూడియోస్‌, సినీ ఒన్‌ స్టూడియోస్‌ సంస్థలపై తెరకెక్కుతోంది. డిసెంబర్‌ 25న థియేటర్లలోకి రానుంది బేబీ జాన్‌.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular