Tuesday, December 24, 2024

‘భైరవం’ లో వెన్నెలగా అదితి శంకర్‌

లీడ్ యాక్టర్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లను రిలీజ్ చేసిన తర్వాత ‘భైరవం’ మేకర్స్ ఇప్పుడు ఫీమేల్ లీడ్ పాత్రలపై దృష్టి పెట్టారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. భైరవం ఇప్పటికే స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో అదితి శంకర్‌ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమెను అల్లరి పిల్ల “వెన్నెల”గా పరిచయం చేశారు. పోస్టర్ అదితి రస్టిక్ అవతార్‌లో, హాఫ్ సారీ ధరించి వైకిల్ నడుపుతూ కనిపించారు. నేచురల్ బ్యూటీ, ప్రజెన్స్ తో క్యారెక్టర్ ఎసెన్స్ ని ప్రజెంట్ చేశారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటిస్తున్నారు.

 

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com