- ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని
- డిజిపిని ఆదేశించిన సిఎం రేవంత్
- కొట్టి చంపిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆగ్రహం
నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలో పట్టపగలు గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని సిఎం రేవంత్ హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహారించినట్లు తేలితే, అక్కడి బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపికి సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఆరేళ్ల బాలిక కుటుంబానికి తగిన న్యాయం చేస్తాం
పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని సిఎం రేవంత్ భరోసా ఇచ్చారు