Friday, January 10, 2025

మ‌న ప్ర‌చారం ప‌నికిరాలే

మ‌హారాష్ట్రలో సీఎం ప్రచారం చేసిన చోట గెలవని కాంగ్రెస్

మ‌హారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ఊహించని షాకిచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. 288 అసెంబ్లీ స్థానాల‌కు గానూ ఎంవీఏలో భాగ‌మైన కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసింది. కానీ 22 స్థానాల్లో మాత్ర‌మే లీడింగ్‌లో ఉంది. పూర్తిస్థాయి ఫ‌లితాలు వెలువ‌డే స‌మ‌యానికి ఈ సంఖ్య కాస్త త‌గ్గొచ్చు. అయితే మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ ప్ర‌చారం నిర్వహించిన చంద్రాపూర్, భోకార్, నాయ‌గావ్‌, నాందేడ్ నార్త్, షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సౌత్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకంజలోనే ఉన్నారు. మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలు, తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీల గురించి సీఎం రేవంత్ చెప్పినప్పటికీ ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదని అర్థమ‌వుతుంది. అందుకు ఈ ఫలితాలే నిదర్శనమని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మహారాష్ట్రలో ఇవాళ ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఎగ్జిట్ ఫలితాలు ఎలా వచ్చాయో రిజల్ట్ కూడా అచ్చం అలాగే వస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలోకి రానున్న‌ది. మహారాష్ట్రలో మహా యుక్తి కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ఇప్పటి వరకు పూర్తయిన కౌంటింగ్ లోబీజేపీ కూటమికి 220 స్థానాలు దక్కేలా కనిపిస్తున్నాయి. 220 స్థానాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అటు కాంగ్రెస్ కూటమికి 55 స్థానాలు ఆధిక్యంలో ఉన్నారు. అది మరింత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇతరులు 13 స్థానాలలో ముందంజలో కనిపిస్తున్నారు.

ప‌వ‌న్ ప్ర‌యోగం స‌క్సెస్‌
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ హోదాలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించిన బీజేపీ సక్సెస్ అయినట్లు అంచ‌నా వేసుకుంటున్న‌ది.
మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోటా బీజేపీ ఆదిక్యంలో ఉంది. మహారాష్ట్రలోని బల్లార్ పూర్, పూణే, డెగ్లూరు, సోలాపూర్, లాతూర్,లాంటి ప్రాంతాల్లో పవన్ ప్రచారం చేశారు. ఈ అన్ని స్థానాల్లో బీజేపీ ముందంజ‌లో ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడంతోనే బీజేపీ అక్కడ గెలుస్తోందని జనసేన నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com