Friday, November 22, 2024

మీరు ఇన్‌ఫార్మ‌ర్లు…

ఇద్దర్ని నరికి చంపిన మావోయిస్టులు

ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. వాజేడు మండలానికి చెందిన ఇద్దరు గిరిజనుల్ని నరికి చంపారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో రమేష్, అర్జున్ అనే ఇద్దర్ని హతమార్చి.. ఇన్‌ఫార్మ‌ర్ల ముసుగులో ఉండి, పోలీసుల‌కు స‌మాచారం ఇస్తున్నార‌ని లేఖ వదిలివెళ్లారు. వాజేడు మండలం జంగాలపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు.. గిరిజనుల్ని చంపిన వార్త స్థానికంగా కలకలం రేపింది. అయితే మృతులు మావోయిస్టు కదలికలపై ఓ కన్నేసి ఉంచడమే కాకుండా వాటిని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేశారని, అందుకే హతమార్చామంటూ లేఖను వదిలివెళ్లారు మావోయిస్టులు. హతమైన వారిలో ఒకరు పేరూరు పంచాయితీ కార్యదర్శి రమేష్ కాగా..మరొకరు అదే గ్రామానికి చెందిన స్థానికుడు.
గత కొన్నాళ్లుగా ఛత్తీష్ ఘఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వరుస ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు.. ములుగు జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు. తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేరుస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు యువకుల్ని దారుణంగా నరికి చంపేశారు. ఓ వైపు ప్రభుత్వం సీరియస్ గా ఉండడం, మరోవైపు భద్రతా దళాల కదలికలు ఎక్కువగా ఉండడం స్తబ్దుగా ఉంటూ వస్తు్న్న మావోలకు.. ఇటీవల కాలంలో వరుస ఎన్ కౌంటర్లు ఎదురయ్యాయి. ఈ కారణంగానే చాన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు.. సుదీర్ఘ కాలం తర్వాత జంట హత్యలతో అలజడి సృష్టించారు. ఈ చర్యతో ములుగు జిల్లాల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో ఈ హ‌త్య‌లు జరిగాయి. తెల్లవారుజామున అనుమానితుల ఇళ్ల వద్దకు వచ్చిన మావోయిస్టులు ఇద్దరు యువకుల్ని బయటకు పిలిచి మరీ దారుణంగా హత్య చేశారు. మృతులు ఉయిక అర్జున్, ఉయిక రమేష్ అనే ఆదివాసీలుగా గుర్తించారు. మృతులిద్దరూ అన్నదమ్ములు కాగా.. ఉయిక రమేశ్ గ్రామ పంచాయతీ సెక్రటరి హోదాలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరిద్దరి హత్యతో ఈ ప్రాంతంలో మావోయిస్టులు భయం సృష్టించారు. సంఘటనా స్థలంలో రెండు లేఖల్ని మావోయిస్టులు వదిలి వెళ్లారు.. ఈ లేఖలు వెంకటాపురం – వాజేడు ఏరియా కార్యదర్శి శాంత పేరుతో ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ.. మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు ఇస్తున్నాడని రమేష్ ను చంపేశామ‌ని, పక్కనే ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కూడా మావోయిస్టుల కదలికల్ని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇస్తున్నాడని, అందుకే చంపేస్తున్నామని మావోయిస్టులు వ‌దిలిన లేఖ‌లో వెల్లడించారు.
రమేష్ ను గొడ్డలితో నరికి చంపుతుండ‌గా.. అతని భార్య అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె చేతిలోకి తీసుకున్న గొడ్డలిని లాక్కుని మరీ రమేష్ ను నరిచి చంపేశారు. మావోలకు అన్యాయం చేశాడని ఆరోపిస్తూ.. భార్య కళ్ళ ముందే దారుణంగా హతమార్చి పగతీర్చుకున్నారు. రమేష్ సోదరుడు అర్జున్ ను రోడ్డ్డుపైకి లాక్కొచ్చి మరీ నరికి చంపారు. వీరిద్దరు.. పోలీస్ ల కోవర్టులుగా పనిచేస్తున్నారని లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. ఛత్తీస్ గఢ్ – తెలంగాణా సరిహద్దులోని లంకపల్లి, జన్నప్ప, ఊట్ల, శ్యామలదొడ్డి, వాయిపేట గ్రామాల్లోని సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్నేహితుల్ని ఏర్పాటు చేసుకుని.. వారి ద్వారా సమాచారాన్ని పొందుతున్నారని లేఖలో మావోలు తెలిపారు.
ఈ మధ్య కాలంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్లకు పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్న రమేష్ కారణమంటూ లేఖలో పేర్కొన్నారు. అతని తమ్ముడు అర్జున్ చేపల వేట పేరుతో అడవికి వచ్చి మావోయిస్టుల డెన్నులను పసిగట్టి పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని ఆరోపించారు. వీరిద్దరూ పద్ధతి మార్చుకోక పోవడంతోనే హతమార్చామని లేఖలో పేర్కొన్నారు.
కాగా, మావోయిస్టుల ఘాతుకం నేపథ్యంలో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఘటనా స్థలంలో రెండు వేర్వేరు లేఖలు విడుదల చేయడంతో హత్య చేసింది మావోయిస్టులేనా, లేక ఇతర వ్యక్తులా అనే చర్చ సైతం నడుస్తోంది.

ఉనికి కోసమే..
గతంలో ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండేది. ఏటూరు నాగారం మండలంతో పాటు వాజేడు మండలంలోని వెంకటాపురం,పేరూరు,చర్ల వంటి ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకునేవారుజేు. అయితే ప్రస్తుతం ఏటూరు నాగారం, వాజేడు మధ్య రాకపోకలు పెరగడంతో మావోయిస్టుల దాడులు తగ్గాయి. ఈక్రమంలో ఇద్దరు గిరిజనుల్ని మట్టుబెట్టడం చూస్తుంటే జిల్లాలో మావోయిస్టులు ఇంకా యాక్టివ్‌గానే ఉన్నారని తెలిపేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular