ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు
మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో వివిధ జిల్లాలకు చెందిన మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పాల్గొన్నారు.