సిఎం రేవంత్ గోత్ర నామాలపై అన్ని ఆలయాల్లో
ప్రత్యేక పూజలు చేయాలని పిలుపు
దేవాదాయ శాఖలో అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖలకు తెలంగాణ దేవాదాయ, దర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగ జెఏసి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయ అర్చకుల బదిలీలను నిలిపివేస్తూ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డికి దానికి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలకు వారు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
దీంతోపాటు అర్చకుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి గోత్ర నామాలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని అర్చక ఉద్యోగ జేఏసి పిలుపుని చ్చినట్టు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్చక ప్రధాన కార్యదర్శి డి ఆనంద్ శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. వీరభద్ర శర్మ, టక్కర్సు సత్యం, తోటకూరి వెంకటేశ్వర్లు, రెడ్యాల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన బాద్యులు చక్రధర్ ఆచార్యులు, ఎన్. హరికృష్ణ శర్మ, డి. విజయ్ శర్మ, ఆరాద్యుల బాలకృష్ణ. హిడాంబి శ్రీకాంతాచార్యులు, దుర్గి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.