Friday, February 21, 2025

మురుగదాస్‌, శివకార్తికేయన్‌ పవర్‌ఫుల్‌ టైటిల్‌

‘అమ‌ర‌న్’ సినిమాతో త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ భారీ హిట్ ను త‌న ఖాతాలో వేసుకున్నారు. సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించిన ఈ మూవీ విడుద‌లైన అన్ని భాష‌ల్లో హిట్ గా నిలిచింది. ఈ విజ‌యంతో జోరు మీదున్న శివ‌కార్తికేయ‌న్.. ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్ తో కొత్త ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. ‘ఎస్‌కే 23’ వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేక‌ర్స్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ గ్లింప్స్ ను విడుద‌ల చేశారు. శివ‌కార్తికేయ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ గ్లింప్స్ ను విడుద‌ల చేసి, సినిమా టైటిల్ ను కూడా ప్ర‌క‌టించారు. ల‌క్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మ‌ద‌రాసి’ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ ను పెట్టారు మేక‌ర్స్‌. తాజాగా రిలీజైన గ్లింప్స్ లో శివ‌కార్తికేయ‌న్ మునుపెన్న‌డూ చూడ‌ని భ‌యంక‌ర‌మైన కొత్త లుక్ లో క‌నిపించారు. సినిమాటోగ్రాఫ‌ర్ సుదీప్ ఎలామోన్ అద్భుత‌మైన విజువ‌ల్స్ యాక్ష‌న్ ఎలివేట్ చేయ‌గా, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ బీజీఎం దాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది.
మొత్తానికి టైటిల్‌ గ్లింప్స్ తో మేక‌ర్స్‌ చిత్రంపై అంచ‌నాలు పెంచేశారు. రుక్మిణి వ‌సంత‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో విద్యుత్ జ‌మాల్‌, బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

 

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com