Saturday, April 5, 2025

మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు నేడు పోలింగ్

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ప్రచారం ముగిసింది. 22 రోజుల పాటు ఎమ్మెల్సీ అభ్యర్ధులు, ఆయా పార్టీల మధ్య జరిగిన హోరాహోరీ ప్రచారానికి తెరపడింది. ఉమ్మడి ఏడు జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి.
48 గంటల ముందు ప్రచారం ఆపేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాన పార్టీలు, అభ్యర్ధులు ప్రచారాన్ని ముగించేశారు. ఇక ఎన్నికల్లో చివరి మజిలీ అయిన పట్టభద్రులు, టీచర్ ఓటర్ల ప్రలోభాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్‌ ముగిసే వరకు ఆయా జిల్లాల్లో 144 సెక్షన్‌ కూడా అమలులోకి రానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బహుముఖ పోటీ నెలకొనడంతో.. గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఆసక్తికరంగా మారింది. ఈ నెల 3న రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈనెల 8, 9 తేదీల్లో ప్రభుత్వ సెలవు కావడంతో ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలించారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. దాదాపు 25 రోజుల పాటు కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించారు. కాగా ఈ మూడు ఎమ్మెల్సీ పోలింగ్ ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:00 వరకు జరగనుంది. దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగనుంది. పోలింగ్‌కు మరో రోజే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పరిధిలో టీచర్స్ ఎమ్మెల్సీ కి సంబంధించిన ఎన్నికల కోసం మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ తెలిపారు.

మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,41,313 మంది ఉండగా.. అందులో పురుషులు 2,18,060 మంది, మహిళలు 1,23,250 మంది, ఇతరులు ముగ్గురు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీచర్ల స్థానంలో 15 మంది పోటీ ఉండగా.. మొత్తం ఓటర్లు 25,921 మంది ఉన్నారు. అందులో పురుషులు 16,364 మంది, మహిళలు 9,557 మంది ఉన్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 మంది పోటీలో ఉండగా.. మొత్తం ఓటర్లు 24,905 మంది ఉన్నారు. అందులో పురుషులు 14,940 మంది, మహిళలు 9,965 మంది ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com