Sunday, January 5, 2025

“మెగా స్టార్ ఫ్యాన్” మూవీ మెగా అభిమానులకేనా?

అల్లు ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాణంలో కిరణ్ వారియర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం “మెగా స్టార్ ఫ్యాన్” ఈ సినిమా లో పింగ్ పాంగ్ సూర్య , డార్లింగ్ ఫేమ్ నర్సింహా కీలక పాత్రలలో నటించగా ఈ సినిమా ట్రైలర్ ను డైరెక్టర్ ఏ.కోదండ రామి రెడ్డి చేతులు మీదుగా విడుదల చెయ్యడం జరిగింది. కోదండ రామి రెడ్డి మాట్లాడుతూ… సినిమా ట్రైలర్ చాలా బాగుంది మెగా అభిమానులు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .. ఈ సినిమాలో నటించిన నటీనటులకు మరియు దర్శక నిర్మాతలకు ఆయన అభినందనలు తెలిపారు. చిత్ర దర్శకుడు కిరణ్ వారియర్ మాట్లాడుతూ ఈ ట్రైలర్ ని మెగా డైరెక్టర్ కోదండ రమి రెడ్డి చేతుల మీదుగా విడుదల అవ్వడం చాల గర్వాంగా ఉందని ఈ సినీమా కోసం చాలా కష్టపడ్డామని ఒక మెగా అభిమానిగా ఈ సినిమా తీయడం చాల గర్వపడుతున్నాను అని అన్నారు ,, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకర్షిస్తుందని బలంగా నమ్ముతున్నాను అని అన్నారు.

ఈ చిత్ర నిర్మాత అల్లు శ్రీరాములు నాయుడు గారు మాట్లాడుతూ మా ట్రైలర్ దర్శకుడు కోదండరామి రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల అవ్వడం చాలా ఆనందంగా ఉంది .. చిరంజీవి గారు మరియు కోదండ రామి రెడ్డి గారి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు ఎంత విజయం సాధించాయి మన అందరికి తెలుసు .. మా సినిమా కూడా ఈ నవంబర్ 29 న విడుదల అవుతుంది .. ప్రేక్షకులందరూ చూసి ఆదరించాలని అన్నారు ..

నటుడు పింగ్ పాంగ్ సూర్య మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది .. సినిమా చాలా బాగా వచ్చింది అందరికి నచ్చుతుంది అని బలంగా నమ్ముతున్నాను , ఈ ట్రైలర్ కోదండ రామి రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల కావడం చాల ఆనందంగా ఉంది ఈ నెల 29 ప్రేక్షకులందరూ థియేటర్ లో చూసి మమ్మల్ని ఆశీర్వాదించాలని కొరుతున్నాఉ అని పింగ్ పాంగ్ సూర్య అన్నారు ..

 

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com