Monday, May 12, 2025

మేం నెల రోజులు నిర్వహించేవాళ్లం

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​
వేడుకలకు దూరంగా మాజీ సీఎం కేసీఆర్​

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు., ఈ వేడుకలకు మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్​ హాజరుకాలేదు. తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జాతీయ జెండాను, బీఆర్‌ఎస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి కనీస అవగాహన, పరిపక్వత లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన భూపేశ్‌ భగేల్‌.. ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు నిర్వహించారని చెప్పారు. కానీ మన సీఎం మాత్రం దశాబ్ది వేడుకలను ఒక్క రోజుకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వంలో ఉంటే నెలరోజులు నిర్వహించేవాళ్లమని చెప్పారు. తెలంగాణ గురించి గానీ, తెలంగాణ ఏర్పాటులో ఉన్న త్యాగాల గురించి గానీ, జై తెలంగాణ అని ఒక్క మాట పలుకలేని మూర్ఖుడన్నారు.

తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ అవతరణ, కేసీఆర్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సీఎం రేవంత్‌ జాక్‌పాట్‌ ముఖ్యమంత్రి అని, ఏదో అదృష్టవశాత్తు సీఎం అయ్యాడని ఎద్దేవా చేశారు. ఈ విషయం తెలంగాణ మొత్తానికి తెలుసని, ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నదని చెప్పారు. తప్పకుండా ఆయనకు బుద్ధిచెప్పే రోజులు వస్తాయన్నారు. తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి తిలకించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com