Tuesday, March 18, 2025

మేడం.. కంగ్రాట్స్​ మీరు గెలువడం మా అదృష్టం

కేరళలోని వయనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన ప్రియాంక గాంధీతో రాష్ట్ర సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో ప్రియాంకను కలిసి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత సీఎం రేవంత్​రెడ్డి.. ఏఐసీసీ చీఫ్​ మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. జార్ఖండ్​ ఎన్నికలు, మహారాష్ట్రలో ఫలితాలపై చర్చించారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్యట‌న‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప‌ర్యట‌న‌లో భాగంగా మంగళవారం ఆయ‌న ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా తెలంగాణ‌ పెండింగ్ అంశాల‌పై, విభ‌జ‌న హామీల‌పై మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల‌తో సీఎం సమావేశం అయ్యారు. పార్లమెంట్ లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై ఎంపీల‌కు దిశా నిర్దేశం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని స‌మ‌స్యల‌ను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల‌ని సూచించ‌నున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com