Monday, February 24, 2025

మేనల్లుడికి మామ గిఫ్ట్‌

ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గర నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్. ఇటీవల తనను కలిసిన సాయిదుర్గ తేజ్ కు సావర తెగలు చేసిన పెయింటింగ్ ను అందించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా సాయిదుర్గ తేజ్ షేర్ చేశారు. సాయిదుర్గ తేజ్ స్పందిస్తూ – మామయ్య పవన్ కల్యాణ్ దగ్గర నుంచి అందుకునే బ్లెస్సింగ్స్ తో పాటు ఆయన ఇచ్చే ప్రతి గిఫ్ట్ ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పుడు నేను అందుకున్న ఆర్ట్ వర్క్స్ సావర ట్రైబ్ ఆర్టిస్ట్స్ తయారు చేసింది. ఏపీ లేపాక్షి షోరూం నుంచి ఈ పెయింటింగ్స్ తీసుకొచ్చారు. ఏపీలోని ఉత్తరాంధ్ర ఏజెన్సీకి చెందిన ఈ సావర ట్రైబ్ నేచురల్ కలర్స్ తో ఈ పెయింటింగ్స్ గీస్తారు. శతాబ్దాల చరిత్ర ఉన్న సావర తెగల వారి కళ అంతరించిపోతోంది. వీరి ఉనికిని కాపాడాలంటే మనమంతా సావర తెగలు తయారుచేసిన పెయింటింగ్స్, ఇతర అలంకరణ వస్తువులు కొనుగోలు చేసి ప్రోత్సహించాలి. పవన్ కల్యాణ్ ఎవరికైనా బహుమతిగా కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలతో పాటు సావర తెగల పెయింటింగ్స్ ఇస్తారు అని పేర్కొన్నారు.

 

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com