Tuesday, December 24, 2024

రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి మారారని, అధికారులకు ఫోన్లోనే ఆదేశాలు జారీ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి ఐదేళ్లేనని గుర్తుంచుకోవాలని, ఆయనకు దమ్ముంటే తమతో కోట్లాడాలని, రాజకీయంగా తలపడాలి కానీ పేదలు, రైతులకు మాత్రం నష్టం కలిగొంచవద్దని కేటీఆర్ హెచ్చరించారు. సంగారెడ్డి సెంట్రల్‌ జైల్లో ఉన్న లగచర్ల బాధితులను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాడు పరామర్శించాడు. వారితో ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తమ వద్ద నుంచి భూములు లాక్కోవద్దని నిరసన తెలిపిన లగచర్ల రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఎత్తివేసి, వారిని జైళ్ల నుంచి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 30, 40 కిలోల బ‌రువు కూడా లేని పిల్ల‌లు అధికారులపై హ‌త్యాయ‌త్నం చేశార‌ంటూ కేసులు పెట్ట‌డానికి రేవంత్ రెడ్డికి మ‌న‌సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కష్టపడి సాధించుకున్న రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి రాబందులా మారారని కేటీఆర్‌ విమర్శించారు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కేసీఆర్ హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ పెడితే తన కుటుంబసభ్యుల కోసం మార్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లోనే మొదట తిరుగుబాటు మొదలైందని, సంగారెడ్డి జిల్లా న్యాల‌క‌ల్‌లో కూడా రైతులు పోరాటం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఫోన్‌లో ఆయన ఇచ్చే ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఫార్మా సిటీ కోసం వేల ఎకరాలు కావాలని రేవంత్ సర్కార్ చెబుతోంది. తమ భూములు తీసుకోవద్దని చెప్పినందుకు వారిపై అక్రమ కేసులు బనాయించి రైతులు, పేదల్ని వేధింపులకు గురిచేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న ఆందోళనలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com