Friday, July 5, 2024

రాష్ట్రంలోని దేవాలయాల మరమ్మతులు, అభివృద్ధి కోసం

కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆలయాల చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని దేవాలయాల్లో మరమ్మతులు, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ, ఆర్కియాలజీ శాఖల అధికారులతో ఓ సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని చారిత్రక, పురాతన ఆలయాల మరమ్మతులు, పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని పలు ఆలయాలు శిథిలావస్థలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

వాటిలో కొన్ని దేవాదాయ శాఖ పరిధిలో ఉండగా, మరికొన్ని ఆర్కియాలజీ శాఖ అధీనంలో ఉన్నాయి. ఈ రెండు శాఖలు సమన్వయంగా పని చేసి ఆలయాల చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించనున్నాయి. ఈ సంయుక్త కమిటీ చైర్‌పర్సన్‌గా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కన్వీనర్‌గా హెరిటేజ్, ఆర్కియాలజీ శాఖ డైరెక్టర్ వ్యవహారిస్తారు. కమిటీ కో కన్వీనర్‌గా దేవదాయ శాఖ డైరెక్టర్, సభ్యుడిగా యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ సీఈఓగా జి.కిషన్ రావు, ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆర్కిటెక్ సత్యనారాయణ మూర్తిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో ఆలయాలకు అవసరమైన మరమ్మతులు, పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధిలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular