Monday, January 13, 2025

రూ. 2.94 ల‌క్ష‌ల కోట్ల‌తో ఏపీ బ‌డ్జెట్‌

సాగు రంగానికి పెద్ద‌పీట‌
విద్య‌కు 29 వేల కోట్లు
నీటిపారుద‌ల‌కు ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ. 2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైన‌ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

సాగు సంబురం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అచ్చెన్నాయుడు.. ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం వెన్నెముకగా పేర్కొన్నారు. రైతు అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని.. రైతులకు ఆధునిక పనిముట్లు, రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తామని మంత్రి అచ్చెన్న తెలిపారు. వడ్డీ లేని రునాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యమిస్తామని అచ్చెన్న చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో భూసార పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదిక వ్యవసాయ మంత్రి ప్రకటించారు. సాగుకు సూక్ష్మ పోషకాలు అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వ్యవసాయ రంగానికి నిర్ధిష్ట ప్రణాళిక అవసరం అన్నారు మంత్రి. పెట్టుబడి సాయం పెంచి నెల రోజుల్లోనే అందించామని చెప్పారు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే.. లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్‌ రూపొందించామని మంత్రి తెలిపారు. వ్యవసాయం ఆధారంగా 62% మంది జీవిస్తున్నారని.. 2047 టార్గెట్‌తో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

 

రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఇది

రూ. 2.94. లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.
రూ. 43,402.33 కోట్లు వ్యవసాయ బడ్జెట్.

రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు.
మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు.
రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు.
ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు.
జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం.
జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం.

 

పూర్తి కేటాయింపులు
వ్య‌వ‌సాయానికి రూ. 4,3402.33 కోట్లు
సంక్షేమం రూ.4,376 కోట్లు
మహిళ, శిశు సంక్షేమం రూ. 4,285కోట్లు
మానవ వనరుల అభివృద్ధి రూ. 1,215కోట్లు
పాఠశాల విద్య రూ. 29,909కోట్లు
ఉన్నత విద్యకు 2,326 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ. 18,421కోట్లు
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ. 16,739 కోట్లు
పట్టణాభివృద్ధి రూ. 11,490 కోట్లు
గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు
జలవనరులు రూ. 16,705 కోట్లు
పరిశ్రమలు వాణిజ్యం రూ. 3,127కోట్లు
ఇంధన రంగం రూ. 8,207 కోట్లు
ఆర్ అండ్ బీ రూ. 9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక 322కోట్లు
పోలీస్ శాఖకు రూ. 8,495 కోట్లు
పర్యావరణ, అటవీ రూ. 687 కోట్లు
బీసీ సంక్షేమం రూ. 3,907 కోట్లు..
మైనారిటీ సంక్షేమం రూ. 4,376 కోట్లు..
ఎస్టీ సంక్షేమం రూ. 7,557 కోట్లు..
దీపం పథకానికి రూ. 895 కోట్లు..
==

 

వ్యవసాయ బడ్జెట్‌

రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు
భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు
విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు
ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు
PACSల ద్వారా ఎరువుల పంపిణీ
డిజిటల్‌ వ్యవసాయం – రూ.44.77 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ – 187.68 కోట్లు
వడ్డీ లేని రుణాలు – రూ.628 కోట్లు
అన్నదాత సుఖీభవ – రూ.4,500 కోట్లు
రైతు సేవా కేంద్రాలు – రూ.26.92 కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ – రూ.44.03 కోట్లు
పంటల బీమా – రూ.1,023 కోట్లు
వ్యవసాయ శాఖ – రూ.8,564.37 కోట్లు
ఉద్యానశాఖ – రూ.3,469.47 కోట్లు
పట్టు పరిశ్రమ – రూ.108.44 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్‌ – రూ.314.8 కోట్లు
సహకార శాఖ – రూ.308.26 కోట్లు
ప్రకృతి వ్యవసాయం – రూ.422.96 కోట్లు
ఎన్జీ రంగా యూనివర్సిటీ – రూ.507.3 కోట్లు
ఉద్యాన యూనివర్సిటీ – రూ.102.22 కోట్లు
వ్యవసాయ పశు విశ్వవిద్యాలయం – రూ.171.72 కోట్లు
ఫిషరీస్‌ యూనివర్సిటీ – రూ.38 కోట్లు
పశు సంవర్థక శాఖ – రూ.1,095.71 కోట్లు
మత్స్యరంగం అభివృద్ధి – రూ.521.34 కోట్లు
ఉచిత వ్యవసాయ విద్యుత్‌ – రూ.7,241.3 కోట్లు
ఉపాధి హామీ అనుసంధానం – రూ.5,150 కోట్లు
ఎన్టీఆర్‌ జలసిరి – రూ.50 కోట్లు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ – రూ.14,637.03 కోట్లు

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com