Friday, May 16, 2025

రైతుల‌కు గౌర‌వం ఇవ్వండి

వారి ఇష్టప్రకారమే భూసేకరణ జరగాలి
బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు
ఎంపీ ఈటల రాజేంద‌ర్‌

భూసేకరణ రైతుల ఇష్టప్రకారం జరగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కొడంగల్‌ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు, కరెంటు బంద్‌ చేసి వందల మంది పోలీసులను గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కలెక్టర్‌, అధికారులపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని, అయితే రైతులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని వెల్లడించారు. భూసేకరణ రైతుల ఇష్ట ప్రకారం జరగాలి తప్ప.. బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. గతంలో ముచ్చర్లలో ఫార్మా సిటీ కోసం భూములు సేకరించినప్పుడు ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ఇదే కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించదని ఆయన గుర్తుచేశారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై దాడిని ఖండిస్తున్నామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. దుద్యాల ఘటన ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని చెప్పారు. దాడి వెనుక ఎవరున్నా సహించేది లేదని చెప్పారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com