Saturday, December 28, 2024

వసూళ్ల కమలం

ఈ ఏడాది బీజేపీకి 2,244 కోట్ల పార్టీ ఫండ్

ఈ ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి పార్టీఫండ్ భారీగా వచ్చింది. గత గతేడాది తో పోలిస్తే మూడు రెట్లకంటే అధికంగా పార్టీ విరాళాలు సంపాదించింది. విరాళాల రూపంలో 2023-24లో ఏకంగా రూ. 2వేల 244 కోట్లు పొందింది. ఇక ప్రతిపక్ష పార్టీ, దేశంలో రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ కు కేవలం రూ. 288.9 కోట్లు మాత్రమే వచ్చాయి. ప్రుడెంట్ ఎలక్టోకరల్ అధికంగా విరాళాలు ఇచ్చిన దాతగా ఉంది. 2023-24లో వ్యక్తులు, ట్రస్టులు , కార్పొరేట్ సంస్థలు నుంచి రూ. 20వేలు అం తకంటే ఎక్కువ విరాళాల రూపంలో బీజేపీకి (BJP) దాదాపు రూ. 2వేల 244కోట్లు వచ్చాయి. ఇది 2022-23తోలో వచ్చిన విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువ. మరోవైపు కాంగ్రెస్ కు 2023-24లో రూ. 288.9 కోట్ల విరాళాలు వచ్చాయి. గతేడాది కాంగ్రెస్ కు కేవలం 79.9కోట్లు మాత్రమే వచ్చాయి.

2023-24 లో రెండు పార్టీలకు వచ్చిన విరాళా వివరాల రిపోర్టులను ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో ఉంచింది. ఫ్రూడెంట్ ఎలక్టోర్ ట్రస్ట్ నుంచి బీజేపీ రూ. 723.60కోట్ల విరాళాలు అందుకుంది. అదే కంపెనీ కాంగ్రెస్ కు రూ.156.4కోట్లు అందించింది. రెండు పార్టీలకు అత్యధిక విరాళాలు ఈ సంస్థ నుంచే వచ్చాయి. బీజేపీకి మూడింట ఒకవంతు, కాంగ్రెస్ కు సగానికి పైగా ఈ సంస్థనుంచే విరాళాలు అందాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ 2023-24 కంట్రిబ్యూషన్ రిపోర్టులలో పార్టీ విరాళాలను ప్రకటించాయి. వీటిలో BRS 495.5 కోట్లు, డీఎంకే 60 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ.121.5 కోట్లు, JMM రూ. 11.5 కోట్లుపొందినట్లు ప్రకటించాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి పార్టీఫండ్ భారీగా వచ్చింది.గత గతేడాది తో పోలిస్తే మూడు రెట్లకంటే అధికంగా పార్టీ విరాళాలు సంపాదించింది. విరాళాల రూపంలో 2023-24లో ఏకంగా రూ. 2వేల 244 కోట్లు పొందింది. ఇక ప్రతిపక్ష పార్టీ, దేశంలో రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ కు కేవలం రూ. 288.9 కోట్లు మాత్రమే వచ్చాయి. ప్రుడెంట్ ఎలక్టోకరల్ అధికంగా విరాళాలు ఇచ్చిన దాతగా ఉంది. 2023-24లో వ్యక్తులు, ట్రస్టులు , కార్పొరేట్ సంస్థలు నుంచి రూ. 20వేలు అం తకంటే ఎక్కువ విరాళాల రూపంలో బీజేపీకి దాదాపు రూ. 2వేల 244కోట్లు వచ్చాయి. ఇది 2022-23తోలో వచ్చిన విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువ. మరోవైపు కాంగ్రెస్ కు 2023-24లో రూ. 288.9 కోట్ల విరాళాలు వచ్చాయి. గతేడాది కాంగ్రెస్ కు కేవలం 79.9కోట్లు మాత్రమే వచ్చాయి.

2023-24 లో రెండు పార్టీలకు వచ్చిన విరాళా వివరాల రిపోర్టులను ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో ఉంచింది. ఫ్రూడెంట్ ఎలక్టోర్ ట్రస్ట్ నుంచి బీజేపీ రూ. 723.60కోట్ల విరాళాలు అందుకుంది. అదే కంపెనీ కాంగ్రెస్ కు రూ.156.4కోట్లు అందించింది. రెండు పార్టీలకు అత్యధిక విరాళాలు ఈ సంస్థ నుంచే వచ్చాయి. బీజేపీకి మూడింట ఒకవంతు, కాంగ్రెస్ కు సగానికి పైగా ఈ సంస్థనుంచే విరాళాలు అందాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ 2023-24 కంట్రిబ్యూషన్ రిపోర్టులలో పార్టీ విరాళాలను ప్రకటించాయి. వీటిలో BRS 495.5 కోట్లు, డీఎంకే 60 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ.121.5 కోట్లు, JMM రూ. 11.5 కోట్లుపొందినట్లు ప్రకటించాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com