Wednesday, December 25, 2024

వికారాబాద్ దాడి ఘటనకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

రెవెన్యూ మంత్రిని కలిసి వినతిపత్రం అందించిన ఉద్యోగ జేఏసి ప్రతినిధులు

వికారాబాద్ దాడి ఘటనకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి పట్ల రెవెన్యూ ఉద్యోగులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులంతా భయాందోళనకు గురవుతున్నారని, విధి నిర్వహణలో ఉద్యోగులపై ఇలాంటి అవాంచనీయ సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కోరారు.

ఈ ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని వారు మంత్రికి సూచించారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను ఎవ్వరిని వదిలిపెట్టమని, ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసి సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు, ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కె. చంద్ర మోహన్, ట్రెసా ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, టిజిఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ట్రెసా ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి సుధాకర్, రామకృష్ణ రెడ్డి, సభ్యులు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com