జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు కొత్త మలుపులు తిరుగుతున్నది. సైలెంట్ అయిన కేసులో మళ్లీ కదలిక మొదలైంది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు మద్దూరి విజయకి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. పలు కేసుల్లో కీలక నిందితులు దేశం విడిచి.. తప్పించుకుపారిపోతుండటంతో.. విజయ్ మద్దూరి కూడా దేశం విడిచి పోతాడనే అనుమానాలతో ఈ నోటీసులు జారీ చేశారు.
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావటంతో మోకిలా పీఎస్‌లో ఎన్‌డీపీసీ సెక్షన్ కింద కేసు మద్దూరి విజయ్‌పై కేసు నమోదు అయ్యింది. తాజాగా ఈ కేసులో నిందితుడిగా విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయే అవకాశముందన్న సమాచారంతో విజయ్‌కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో విచారణ జరుగుతుండడంతో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చేయన్న దానిపై అధికారులు ఫోకస్ చేశారు. ఇంతకీ డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నాడనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే, విచారణ నేపథ్యంలో విజయ్ ఫోన్ విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించాడని భావిస్తున్నారు. పట్టుబడిన రోజు తన ఫోన్ కాకుండా, మరో మహిళ ఫోన్‌ను పోలీసులకు అందజేశాడు. దీనిపై మరో కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అసలు విజయ్ ఎవరి ద్వారా డ్రగ్స్ తీసుకున్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు. అరెస్ట్ కాకుండా ముందగా న్యాయస్థానాన్ని సంప్రదించాడు. విచారణకు సహకరించకుండా మరో దేశానికి వెళ్తాడనే సమాచారం పోలీసులకు వచ్చింది. విదేశీ మద్యం కొనుగోలు, డ్రగ్స్‌పై ఎవరి దగ్గర తీసుకున్నాడనేది తేలితే ఈ కేసు ముగింపు రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు.