బికిని ధర ఎంతుంటుంది.. సాధారణంగా ఐతే వెయ్యి రూపాయలు.. లేదు ఇంకా బ్రాండెడ్ ఐతే ఓ ఐదు వేల రూపాయలు. ఇంకా ఫేమస్ డిజైనర్ డిజైన్ చేసిన బికినీ ఐతే ఓ పది వేల రూపాయలు ఉంటుంది. అంతే గాని బికినీ ధర కోట్లల్లో ఉండదు కదా. లేదు బికినీ ధర సైతం కోట్ల రూపాయల్లో ఉంటుందని అమెరికాలో జరిగిన తాజా వేలం నిరూపించింది. ఓ బికినీ ఏకంగా 1.46 కోట్ల రూపాయలు పలికి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అమెరికాలోని హెరిటేజ్లో నిర్వహించిన వేలంలో సదరు బికినీ ధర అందర్నీ షాక్కు గురి చేసింది. ఇంతకీ అంది భారీ ధర పలికిన ఆ బికినీ ఎవరిది, దాన్ని ఎవరు ధరించారు, అంత ధర పెట్టి ఆ బికినీని ఎవరు కొన్నారన్న ఆసక్తి అందరిలో కలుగుతోంది. ఈ ప్రత్యేకమైన బికినీని ఫేమస్ డిజైనర్ రిచర్డ్ మిల్లర్ డిజైన్ చేశారు. 24 క్యారెట్ల మేలిమి బంగారంతో డిజైన్ చేసిన ఈ స్పెషల్ బికినీ వేలంలో ఏకంగా 1.75 లక్షల డాలర్లు అంటే మన రూపాయల్లో ఏకంగా 1.46 కోట్లు పలికింది.
సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1983 లో విడుదలైన స్టార్ వార్స్ సినిమాలో ఈ బికినీని ప్రముఖ హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ ధరించారు. స్టార్వార్స్ సినిమా కోసమే ఈ ప్రత్యేకమైన బంగారు బికినీని తయారు చేయించారట. ఇన్నేళ్లైనా ఈ బికినీకి గానీ, స్టార్వార్స్ సినిమాకు ఉన్న ఉన్న విలువ ఏ మాత్రం తగ్గలేదని వేలం నిర్వహించిన జో మద్దలేనా అన్నారు. అమెరికాలోని హెరిటేజ్లో నిర్వహించిన ఈ వేలం ప్రక్రియలో ఆ బంగారు బికినీని ఓ వ్యక్తి 1.46 కోట్లకు సొంతం చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు.