Friday, December 27, 2024

శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)కు ఆహ్వానం

ఆహ్వాన ప‌త్రిక అందించిన దుర్గ‌గుడి ఈవో, ప్ర‌ధాన అర్చ‌కులు

విజ‌య‌వాడ : ఇంద్ర‌కీలాద్రి పై కొలువుదీరిన శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామి వార్ల స‌న్నిధిలో ఈ నెల 3 నుంచి 12 తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే ద‌స‌రా శ‌రన్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల‌కు విచ్చేయాల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ను ఆహ్వానించారు. మంగ‌ళ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ కు శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామి ఆల‌య ఈవో కె.ఎస్.రామారావు, ప్ర‌ధాన అర్చ‌కులు ఎల్.దుర్గా ప్ర‌సాద్, రంగ‌వ‌ర్ఝుల శ్రీనివాస శాస్త్రి ఆహ్వాన‌ప‌త్రిక అందించ‌టంతో పాటు అమ్మ‌వారి తీర్ధ ప్ర‌సాదాలు, శేష వ‌స్త్రం అంద‌జేశారు.

వేద పండితుడు చిట్టి ఘ‌నాపాఠి ఎంపి కేశినేని శివ‌నాథ్ కి వేద ఆశీర్వ‌చ‌నం అంద‌జేశారు. అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ వారిని శాలువాతో స‌త్క‌రించారు. ఆ త‌ర్వాత ఇంద్ర‌కీలాద్రి పై జ‌రుగుతున్న శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వ ఏర్పాట్ల గురించి ఎంపి కేశినేని శివ‌నాథ్ అడిగి తెలుసుకున్నారు

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com