మాజీ ఎంపీ వి.హనుమంతరావు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక వివక్షను రూపుమాపేందుకు దోహదపడుతుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. సమ గ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రారంభమైన నేపథ్యంలో బాగ్‌అంబర్‌పేటలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. హనుమంత రావుతో పాటు అంబర్‌పేట కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ సి. రోహిణ్‌రెడ్డి హాజరై క్షీరాభిషేకం చేశారు. అలాగే, అంబర్‌పేట డీఎంసీ మారుతి దివాకర్ ఆధ్వర్యం లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో పాల్గొని ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. అనంతరం వి.హనుమంత రావు మాట్లాడుతూ, జనాభాకు అనుగుణంగా రాజ్యాంగ ఫలాలు అన్ని కులాలకు అందాలంటే సమగ్ర కులగణన జరగాల్సి ందేనని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించి ందన్నారు.
ఇందులో భాగంగానే తెలంగా ణలో సీఎం రేవంత్ రెడ్డి చేత ప్రయోగా త్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో ఈ సర్వేను నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరిగే సర్వేలో ప్రజలందరూ పాల్గొనే విధంగా కాంగ్రెస్ పార్టీ నా యకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శంబుల శ్రీకాంత్‌గౌడ్, ఖైర తాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణగౌడ్, మాజీ కార్పొ రేటర్లు రాంబాబు, పుల్లా నారాయణ స్వామి, పులిజగన్, గరిగంటి శ్రీదేవి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
‘దమ్ముందా ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌ను ఆయన ఈస్టిండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసివేయడానికి.. దమ్ముందా లేదా..’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘సీఎం అయ్యి ఉండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ లోపాల గురించి ప్రశ్నించే శక్తి రావడానికి మీకింకా ఎంత సమయం పడుతుంది..’ అని కేటీఆర్ ఆంగ్లంలో ప్రశ్న వేశారు. ‘తెలంగాణకు తొలి ప్రాధాన్యం అనే ఆలోచన రావడానికి మీకు ఇంకా ఎన్ని రోజులు కావాలి..’ అని నిలదీశారు. ఈ పోస్టుతోపాటు ‘సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవీ’ అనే శీర్షికతో ప్రచురితమైన పత్రికా క్లిప్పింగ్‌ను కేటీఆర్ జత చేశారు.