Friday, April 4, 2025

సిఎం రేవంత్‌ ‌బండారం బట్టబయలు

  • మెగా కంపెనీకే 11వందల కోట్ల కాంట్రాక్ట్ ‌పనులు
  • బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి విమర్శలు

కేంద్ర ప్రభుత్వం అమృత్‌ ‌పథకం ద్వారా రాష్టాన్రికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్‌ ‌చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్ ‌హాల్‌లో మహేశ్వర్‌ ‌రెడ్డి వి•డియాతో మాట్లాడారు. శోధ, గజా, కేఎన్‌ఆర్‌ ‌కంపెనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారని మహేశ్వర్‌ ‌రెడ్డి తెలిపారు. రేవంత్‌ ‌బామ్మర్ది సుజన్‌ ‌రూ. 400 కోట్ల పనులు చేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల పనులు అప్పగించారు. ఎస్టిమెట్లు అన్ని కాంట్రాక్టర్లు తయారు చేసుకున్నారు. రూ. 600 కోట్లతో అయ్యే పనికి వెయ్యి కోట్ల రూపాయలుగా ఎస్టిమెట్లు తయారు చేశారు.

కాంట్రాక్టర్లు 30 నుంచి 35 శాతం లెస్‌ ‌వేసి టెండర్లు దక్కించుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్క జీవోను కూడా పబ్లిక్‌ ‌డొమైన్‌లో పెట్టడం లేదు. టెండర్‌ ‌డాక్యుమెంట్స్‌ను పబ్లిక్‌ ‌డొమైన్‌లో ఎందుకు పెట్టడం లేదని మహేశ్వర్‌ ‌రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఒక వైపు జ్యుడిషియల్‌ ‌విచారణ జరుగుతుంటే? అదే మెగా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల పనులు ఎలా అప్పగించారు..?

ఏడు నెలల్లో చేసిన చీకటి ఒప్పందాలకు, టెండర్లకు.. విచారణకు సిద్ధమా..? హెటిరో డ్రగ్స్ ‌భూమి విషయంలోనూ, సివిల్‌ ‌సప్లై అవినీతిపై విచారణకు సిద్ధమా..? కొడంగల్‌ ‌ప్రాజెక్టు కూడా మెగా కృష్ణారెడ్డికే అప్పగించబోతున్నారు. తెలంగాణలో చీకటి కోణంలో చీకటి పాలన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధుల దుర్వినియోగంపై సీబీఐ, ఈడీ విచారణ చేయాలని కోరనున్నట్లు మహేశ్వర్‌ ‌రెడ్డి తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com