Tuesday, November 26, 2024

సీఎం పదవికి ఏక్​నాథ్​రాజీనామా మళ్లీ ఆయనే సీఎం

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. ఆయన వెంట బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌, ఎన్​పీ నేత అజిత్‌ పవార్‌ కూడా వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని శిండేను గవర్నర్‌ కోరారు. దీంతో ఆయన తాత్కాలిక సీఎంగా కొనసాగుతున్నారు.
మహారాష్ట్ర 14వ శాసనసభ గడువు మంగళవారంతో ముగియనుండటం వల్ల ఏక్‌నాథ్‌ శిందే రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 132స్థానాలు గెలుపొందగా, శివసేన 57, ఎన్​సీపీ 41 సీట్లల్లో విజయం సాధించాయి. కొత్తప్రభుత్వం ఏర్పాటుకు 145మంది సభ్యుల మద్దతు అవసరం కాగా మిత్రపక్షాల్లో ఏ ఒక్కరు మద్దతిచ్చినా బీజేపీ గద్దెనెక్కుతుంది. అయితే బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం అంటుండగా, ఏక్‌నాథ్‌ శిండేనే కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది. దీంతో సీఎం బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మరింత ఆలస్యం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular