Thursday, January 9, 2025

సొరేన్ స‌ర్కారు జైలుకు వెళ్లి.. విజ‌యాన్ని వ‌రించారు

ఝార్ఖండ్‌లో అంచ‌నాలు తారుమార‌య్యాయి. ఎన్డీఏ కూట‌మికి విజ‌యం ద‌క్కింది. జైలు జీవితం గ‌డిపి వ‌చ్చిన మాజీ సీఎం హేమంత్ సొరేన్‌.. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.
ఝూర్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. ఇండియా కూటమిలోని ఝూర్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దల్ పార్టీలు సంయుక్తంగా మెజారిటీ మార్క్(42)ని అధిగమించాయి. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పుడు బీజేపీ ముందంజలో ఉండగా.. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ నాయకత్వంలోని విజయం తమదేనని ధీమా వ్యక్తం చేసింది. ఆ తరువాత క్రమంగా ఓట్ల లెక్కింపులో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యం సాధించారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 10.30 కల్లా ఇండియా కూటమి 51 సీట్లలో ముందంజలో ఉంది. మరోవైపు బిజేపీ ఎన్డీఏ కూటమి 29 సీట్లు లీడ్ లో ఉంది.
2019 అసెంబ్లీ ఫలితాలు చూస్తే.. జెఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దల్ (ఆర్‌జెడి) పార్టీల కూటమికి 47 సీట్లు దక్కాయి. ఒక్క జెఎంఎం 30 సీట్లలో విజయం సాధించింది. మరోవైపు బిజేపీకి 25 సీట్లు లభించాయి.

జైలు నుంచి వ్యూహ‌ర‌చ‌న‌
కొన్ని నెలల క్రితం జెఎంఎం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యాక. జెఎంఎం పార్టీలో నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. అయితే హేమంత్ సొరేన్ జైలు నుంచి బయటికి వచ్చి తిరిగి పార్టీని గాడిలో పెట్టారు. ఎన్నికల ప్రచారంలో బిజేపీ పై వాడి వేడి అస్త్రాలను సంధించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తారుమారు చేస్తూ.. మేజక్ ఫిగర్ 42ను దాటి 50 సీట్లలో విజయం సాధించడానికి హేమంత్ సొరేన్ ఎన్నికల ప్రణాళిక కీలక పోషించిందనడంతో సందేహం లేదు. ఫలితంగా ఇప్పుడు మూడోసారి రాష్ట్రంలో సొరేన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు.
మరోవైపు ఝూర్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజేపీ తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా.. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అక్రమ వలసదారుల అంశాన్ని లేవనెత్తారు. సొరేన్ ప్రభుత్వం వల్లనే బంగ్లాదేశీయులు ఝార్ఖండ్ లో వచ్చి స్థిరపడుతున్నారని పదే పదే ఎన్నికల ర్యాలీలో చెప్పారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల వల్ల ఝూర్ఖండ్ భూమి, మహిళలు, ఆహారం ప్రమాదంలో ఉన్నాయని.. ఝూర్ఖండ్ లోని ఆదివాసీల భూములు, అడవులను బంగ్లాదేశీయులు ఆక్రమించుకుంటారిన హెచ్చిరించారు.

సంక్షేమంతోనే జేఎంఎం
కానీ జేఎంఎం మాత్రం ఇందుకు భిన్నంగా సంక్షేమ పథకాల ప్రచారంతో ముందుకువెళ్లింది. ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజన (తల్లల సంక్షేమ పథకం), ఆదివాసీ అస్మిత (ఆదివాసీల ఆత్మగౌరవం) నినాదంతో ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.1000 ప్రభుత్వం అందిస్తోంది.
అయితే హేమంత్ సొరేన్ కు ఈ విజయం అంత సునాయాసంగా దక్కలేదు. ఆమె పార్టీ నుంచి కీలక నేతలు బిజేపీలో చేరడంతో చాలా నష్టం చవిచూశారు. హెమంత్ సొరేన్ సొంత వదిన సీతా సొరేన్ బిజేపీ కండువా కప్పుకున్నారు. జనవరి 31 2024న ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసులో సిఎం హేమంత్ సొరేన్ ని అరెస్టు చేసిన తరువాత జెఎంఎం సీనియర్ నాయకుడు చంపయి సొరేన్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. కానీ హేమంత్ సొరేన్ బెయిల్ పై విడుదలై తిరిగి వచ్చిన తరువాత చంపయి సొరేన్ సిఎం పదవి నుంచి దిగాల్సి వచ్చింది. దీంతో చంపయి సొరేన్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. చివరికి అసెంబ్లీ ఎన్నికల ముందు చంపయి సొరేన్ బిజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కీలక నాయకులు పార్టీ వీడినా హేమంత్ సొరేన్ ధైర్యంతో ప్రచారాన్ని అన్నీ తానై ముందుకు నడిపారు. బిజేపీ తప్పులను ప్రజలకు ఎత్తి చూపుతూ చివరికి అనుకున్నది సాధించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com