కాంగ్రెస్ పార్టీలో ప్రచారం ఫుల్.. పనులు మాత్రం నిల్.
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇస్తున్న హామీలకు, అధికారంలోకి వొచ్చాక హామీల అమలు విషయంలో.. నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో సంక్షేమ కార్యక్రమాల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. సోమవారం బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక రకాల వాగ్ధానాలు ఇస్తూ.. ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయకుండా అటకెక్కిస్తూ మోసం చేస్తోంది. ఏరు దాటే దాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా డిక్లరేషన్లు, గ్యారంటీల, మేనిఫెస్టోల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజలను గారడీ చేసే ఓట్లు దండుకుని మోసం చేసింది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి