Saturday, April 19, 2025

హుస్సేన్‌సాగర్ బఫర్ జోన్‌లను కాపాడాల్సిన అవసరం ఉంది

  • జిల్లాల్లోనూ హైడ్రా వ్యవస్థను తీసుకురావాలి
  • సిఎంకు లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హుస్సేన్‌సాగర్ బఫర్ జోన్‌లను కాపాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డిని కోరారు. లేకుంటే భవిష్యత్‌లో హుస్సేన్ సాగర్‌కు చేరాల్సిన వరద నీరు రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉందని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జలాశయాలు, చెరువులు, కుంటల పుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్), బఫర్ జోన్‌ను ఆక్రమించుకున్నోళ్లపై హైడ్రా చేస్తున్న కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆయన ఆదివారం సిఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు.

నిబంధనలకు విరుద్ధంగా జలాశయాల నీటి నిల్వలకు ఆటంకం కలిగించేలా చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడం అందరూ స్వాగతించాలన్నారు. అయితే హైడ్రా కమిషనర్ రాజకీయాలకు అతీతంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని జీవన్‌రెడ్డి ఆ లేఖలో కోరారు. అక్రమ నిర్మాణాలు, బఫర్ జోన్‌లలోని వ్యాపార సంస్థలను కూడా తొలగించాలని జీవన్‌రెడ్డి సిఎంకు రాసిన లేఖలో సూచించారు. ఇక జిల్లాల్లోనూ హైడ్రా వ్యవస్థను తీసుకురావాలని, ఆయా జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లను గుర్తించే బాధ్యత కలెక్టర్లకు ఇవ్వాలని ఆయన ఆ లేఖలో కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com