Sunday, September 29, 2024

మూడు నిమిషాల్లో 1.10 కోట్ల రూపాయలు.. అంతలోనే

ఈ మధ్య సైబర్ మోసాలు పెరిగిన తరువాత మొబైల్ కు ఏ మెస్సేజ్ వచ్చినా అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్‌ కు శుక్రవారం ఉదయం వెనువెంటనే మూడు మెసేజ్‌లు వచ్చాయి. కేవలం మూడు నిమిషాల వ్యవధిలో అంటే 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో  రూ.50 లక్షలు రెండుసార్లు, రూ.10 లక్షలు ఒకసారి.. మొత్తంగా రూ.1.10 కోట్ల భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా ఆ మెస్సేజీల సారాంశం. ఇంకేముంది ఒక్కసారిగా హర్ష భయపడిపోయాడు. తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావడంతో ఆందోళన చెందాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంకు అధికారులను అప్రమత్తం చేసి విషయం చెప్పాడు.
నిమిషాల వ్యవధిలో అంటే 10.22 గంటల వేళలో 1930 నెంబర్‌కు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించాడు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్.. జరిగిన మోసానికి సంబంధించి సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టం సిబ్బందిని రంగంలోకి దించింది. తెలంగాణలో ఈ మోసం జరగడంతో వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్‌లోకి వచ్చేసింది. స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అతడి బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం విషయంపై యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ప్రతినిధుల్ని అలర్ట్ చేసింది. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి.. నిధుల్ని డ్రా చేయకుండా పుట్ ఆన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి రూ.10.42 గంటల వేళలో ఫోన్‌కు మెసేజ్ చేశారు. సైబర్ నేరస్తులు దోచేసిన రూ.1.10 కోట్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular