Wednesday, April 2, 2025

100 డేస్ .. హ్యాపీ డేస్ సీఎం రేవంత్ రెడ్డి

టీఎస్ న్యూస్ :వంద రోజుల పాలన సంతృప్తిగా ఉందని సీఎం రేవంత్ రెడ్డ్ అన్నారు. వందరోజుల్లో ప్రజలు చూపించిన సానుభూతి మరువలేనిదని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాట ఇస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కస్తామన్నారు. 8 లక్షల మంది 500 రూపాయలకే సిలిండర్ కొన్నారని.. 37 లక్షల మందికి జీరో బిల్ ఇచ్చామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలుపై రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాతి రోజే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తరువాత ఒక్కొక్కటిగా గృహజ్యోతి, రూ.500లకే గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు ఇలా అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

చాలా సంతృప్తి ఉంది.. రేవంత్
ఇదిలా ఉండగా.. వంద రోజుల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజుల పాలన సంతృప్తిగా ఉందన్నారు. వందరోజుల్లో ప్రజలు చూపించిన సానుభూతి మరువలేనిదని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాట ఇస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కస్తామన్నారు. 8 లక్షల మంది 500 రూపాయలకే సిలిండర్ కొన్నారని.. 37 లక్షల మందికి జీరో బిల్ ఇచ్చామని తెలిపారు. ఎన్నికల కోడ్ వల్ల కొందరికి జీరో బిల్ ఇవ్వలేకపోయామని చెప్పారు. మార్పు కావాలి కాంగ్రెస్ కావాలి అని ప్రజల్లోకి వెళ్ళామని.. ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చామని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుండే ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టామన్నారు. గత పదేండ్లలో కేసీఆర్ ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని విమర్శించారు. గత ప్రభుత్వ చిక్కుముడులు ఒక్కక్కటిగా విప్పుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com