Monday, April 21, 2025

బంగ్లాదేశ్ ఆందోళనల్లో 100 మంది మృతి

  • బంగ్లాదేశ్ ఆందోళనల్లో 100 మంది మృతి
  • మూడు రోజుల పాటు కర్ఫ్యూ విధింపు

బంగ్లాదేశ్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోటపై అధికార పార్టీ మద్దతుదారులకు, నిరుద్యోగులు-ఆందోళన కారులకు మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారాయి. ఈ విషాదకరమైన సంఘటనల్లో సుమారు 100 మంది మరణించారు. చనిపోయినవారిలో 14 మంది పోలీసులు సైతం ఉన్నారు. మరోవైపు వందల మంది గాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటాకు సంబందించిన అంశంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చారు నిరసనకారులు. తమ నిరసనకు ప్రభుత్వాధికారులు, పోలీసులు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేశారు.

ఆదివారం సహాయ నిరాకరణ కార్యక్రమానికి హాజరవుతున్న నిరుద్యోగులు, ఆందోళనకారులను అధికార అవామీలీగ్, జుబో లీగ్, దాని విద్యార్థి విభాగం ఛాత్ర లీగ్ కార్యకర్తలు అడ్డగించడంతో ఘర్షణలు రాజుకున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. బంగ్లాదేశ్ రాజధాని డాకాలో నార్సింగ్ ప్రాంతంలో అధికార అవామీలీగ్ కు చెందిన ఆరుగురు నేతలను ఆందోళనకారులు కొట్టి చంపేశారు. భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ గాయాలతో 56 మంది ఢాకా హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

మరోవైపు ఢాకాలో బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పలు వాహనాలకు నిప్పుపెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘర్ణల్లో మొత్తం 100 మంది మరణించగా అందులో 14 మంది పోలీసులు ఉన్నారు. ఇక మొత్తం 300 మంది పోలీసులు గాయపడ్డారని తెలుస్తోంది. ఈ ఆందోళనకరి పరిస్థితుల నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బంగ్లాదేశ్ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. మొబైల్ ఇంటర్నెట్ను ఆపేయాలంటూ మొబైల్ ఆపరేటర్లను ఆదేశించంది ప్రభుత్వం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com