చేసుకున్న మాతృమూర్తిని ఘనంగా సన్మానించుకున్న కుటుంబ సభ్యులు.
చిలుకూరు మండల కేంద్రంలోని జెజె నగర్ కాలనీ కి చెందిన, ముదిగొండ కనకమ్మ భర్త వీరయ్య, 100 సంవత్సరాలు పూర్తిచేసుకుని 101వ వసంతంలోకి అడుగుపెట్టిన మాతృమూర్తికి సోమవారం కుటుంబ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. వృద్ధురాలికి ఆరుగురు కుమారులు, సైదులు, హుస్సేన్, ఎర్రయ్య, ముత్తయ్య, సాలయ్య, చిరంజీవి, కుమార్తెలు ఇద్దరు, అక్కమ్మ, కామేశ్వరి, ఈ కుటుంబంలో మనవాళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లతో కలిపి 72 మంది ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనకమ్మ నేటికీ తన శరీర పట్టుత్వం కోల్పోకుండా తన పనులు తానే చేసుకుంటూ పా టలు పాడుతూ పలువురిని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి మాత్రలు వైద్యం లేకుండా చలాకిగా వీధులలో తిరుగుతు పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది.