విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పాజిటివ్ వైబ్ తో సక్సెస్ ఫుల్ గా 100 కోట్ల క్లబ్ లో చేరింది. విక్టరీ వెంకటేష్ – డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ని దాటేసి అదరగొట్టింది. సంక్రాంతికి రిలీజైన సినిమాలలో ఈ సినిమాకే మంచి ఆదరణ లభిస్తుండగా, మూడు రోజుల్లోనే ‘డాకు మహారాజ్’ రికార్డును గల్లంతు చేసి, స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు వెంకీ మామ. తాజాగా ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించి మేకర్స్ అఫీషియల్ గా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
విక్టరీ వెంకటేష్ – డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ముచ్చటగా మూడవసారి వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. క్రైమ్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ముందు నుంచే మంచి పాజిటివ్ హైప్ క్రియేట్ అయింది. ఇక రిలీజ్ అయ్యాక ఆ హైప్ ను మూవీ రీచ్ అవ్వడంతో పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ ఓపెనింగ్ రాబట్టి, వెంకటేష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది.
మొదటి రోజే ఈ సినిమా భారత దేశంలో 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు కూడా అదే హుషారుని కంటిన్యూ చేస్తూ 30 రోజుల్లో కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. రెండు రోజుల్లోనే ఈ మూవీ 77 కోట్లకు పైగా వసూలు చేసిందనే విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక ముచ్చటగా మూడవరోజు ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి, వెంకీ మామకు బ్లాక్ బస్టర్ పొంగల్ అన్పించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 3 రోజుల్లోనే ఏకంగా 106 కోట్ల గ్రాస్ ని రాబట్టింది అంటూ తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు అఫీషియల్ గా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానిపై “ఎనీ సెంటర్… సింగల్ హ్యాండ్… విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ పొంగల్… త్రీ డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 106 కోట్లు” అంటూ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిందన్న విషయాన్ని వెల్లడించారు. మొత్తానికి వెంకీ మామ ఈ సంక్రాంతి ‘ఓజీ’గా నిలవడం విశేషం.
‘డాకు మహారాజ్’ రికార్డును బ్రేక్
ప్రస్తుతం బుక్ మై షో టికెట్ల ట్రేసింగ్ ని చూసుకుంటే సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిని కనుమరుస్తున్నట్టుగా కనిపిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో ‘డాకు మహారాజ్’ మూవీ నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరి బాలయ్య ఖాతాలో మరో అరుదైన రికార్డును సాధించింది. అయితే బాలయ్యకు ఈ 100 కోట్ల క్లబ్లో చేరడానికి నాలుగు రోజులు పడితే, వెంకీ మామకు మూడు రోజులే పట్టడం విశేషం. ఈ మూవీ ఇంతే హుషారుగా మరిన్ని రోజులు థియేటర్లలో ఆడితే వెంకటేష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలవడం ఖాయం.