అతి తక్కువకాలంలో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్న. ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ 4 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయలు. అయితే ఈమె నికర ఆస్తుల విలువ ఎంతంటే అక్షరాల 66కోట్లు. సౌత్‌లో ఒకరకంగానూ, నార్త్‌లో ఒకరకంగానూ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తోంది ఈ భామ. ఛావాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ, ఇక సికిందర్ రిజల్ట్ కోసం వెయిటింగ్. సల్మాన్‌తో కలిసి నటించిన ఆ చిత్రం కూడా హిట్టయితే రాబోయే రోజుల్లో రష్మిక ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా.
కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది రష్మిక. ముంబయిలో సొంత ఫ్లాట్ ఉంది. అంతేకాక హైదరాబాద్‌ర, బెంగుళూరు, గోవా, కూర్గ్‌లో కూడా ఆమెకు స్థిరాస్తులున్నాయి. ఓ వైపు పెట్టుబడులు పెడుతూనే మరోవైపు లగ్జరీకి కూడా ఇంపారెట్న్స్ ఇస్తోంది.