Saturday, February 15, 2025

పదో తరగతి పొడుగోడు ఆదిలాబాద్‌ స్కూల్‌లో 6.8 అడుగుల స్టూడెంట్‌

ఆదిలాబాద్‌ ప్రభుత్వ పాఠశాల్లో ఓ విద్యార్థి ఇప్పుడు స్పెషల్‌ అట్రాక్షన్‌ గా మారాడు. ఆ విద్యార్థి వయస్సు 15 ఏళ్లు. కానీ, ఊహించని ఎత్తు పెరిగాడు. ఆ ఎత్తే ఇప్పుడు తనకు గుర్తింపు తెస్తుంది. ఆదిలాబాద్‌ పట్టణం బొక్కలగూడ కాలనీకి చెందిన వినోద్‌-సుజాత దంపతుల పెద్ద కుమారుడు వన్నెల హేమంత్‌. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఆరడుగుల ఎనిమిది అంగుళాల పొడవుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాధారణంగా 14-15ఏళ్ల వయస్సులో అబ్బాయిలు 5 నుంచి 5.7అడుగులు ఉంటారు. కానీ హేమంత్‌ మాత్రం అనూహ్యంగా పెరిగాడు. తోటి విద్యార్థుల మధ్య హేమంత్‌ ఓ స్తంభంలో ఉంటున్నాడు.
కాగా, ఈ విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చే స్కూల్‌ యూనిఫాం సరిపోవడం లేదు. ఫలితంగా సివిల్‌ డ్రెస్‌లోనే బడికి వస్తున్నాడు. అంతేకాదు.. బడిలో, ఇంటిపక్కన సజ్జల పైన ఏదైనా వస్తువుంటే తననే పిలుస్తారని హేమంత్ చెబుతున్నాడు. స్కూల్​ యూనిఫాం సరిపోకపోవడంతో సివిల్​ డ్రైస్​లోనే వస్తున్నట్లుగా తెలిపాడు. కాళ్లు పొడవుగా ఉండటం వల్ల సైకిల్​ తొక్కడం కష్టంగా ఉందని హేమంత్​ అన్నాడు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తోందని అంటున్నాడు. బాగా చదివితే పోలీస్​గా ఉద్యోగం వస్తుందని టీచర్లు ప్రోత్సహిస్తున్నట్లుగా హేమంత్ వివరించారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com