ఆరుగురు బిజెపి నుంచి, ఐదుగురు కాంగ్రెస్ నుంచి పరాజయం
ఎన్నికల సమయంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని పార్టీ మారిన వారిలో మెజార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. సుమారుగా 11 మంది అభ్యర్థులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. అందులో భాగంగా బిజెపిలో చేరి బరిలోకి దిగిన బీబీపాటిల్ (జహీరాబాద్), పోతుగంటి భరత్ (నాగర్ కర్నూల్), శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ), గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), ఆరూరి రమేశ్ (పెద్దపల్లి), సీతారాం నాయక్ (మహబూబాబాద్) తదితరులు ఓటమి చెందారు.
వీరితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం రంజిత్ రెడ్డి (చేవెళ్ల), దానం నాగేందర్ ( సికింద్రాబాద్), పట్నం సునీతా మహేందర్ రెడ్డి (మల్కాజ్ గిరి), నీలం మధు (మెదక్)లతో పాటు బిఎస్పీకి రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, నాగర్ కర్నూల్‌లో మూడో స్థానంలో నిలవడం విశేషం.