ఉత్తర్‌ప్రదేశ్ లోని హాథ్రస్ లో ఘోరం జరిగిపోయింది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో సుమారు 116 మంది మృత్యువాతపడ్డారు. యూపీలోని రతిభాన్ పుర్ లో శివారాధన కార్యక్రమం జరుగుతుండగా ఈ తొక్కిసలాట జరగింది. ఈ సందర్బంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో చాలా మంది గాయపడ్డారు. ఇక చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ఘచనలో గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఐతే మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషాదకర సంఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని హాథ్రస్ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు హధ్రస్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.