Saturday, April 19, 2025

టీమ్‌ ఇండియాకు 125 కోట్ల రూపాయల బహుమతి

భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

అనూహ్యంగా టీ20 ప్రపంచ కప్‌ 2024 విజేత భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది. ఇండియా టీమ్ కు ఏకంగా 125 కోట్ల రూపాయల నగదు బహుమతి ఇస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండవసారి టీ 20 ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. 2013 తర్వాత టీమ్‌ ఇండియా ఐసీసీ ట్రోఫీ నెగ్గడం ఇదే మొదటిసారి. దీంతో టీ 20 కప్‌ సాధించిన భారత జట్టుకు బీసీసీఐ భారీ 125 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించింది.

ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్ 2024ను గెలిచినందుకు గాను టీమ్ఇం డియాకు 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను.. టోర్నమెంట్ ఆసాంతం జట్టు అసాధారణమైన ప్రతిభ, సంకల్పం, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది.. అద్భుతమైన విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అభినందనలు.. అటూ బీసీసీఐ సెక్రెటరీ జై షా ట్విట్టర్ లో పోస్టు చేశారు. బీసీసీఐ ప్రకటనతో ఇండియా టీమ్ సభ్యులే కాదు క్రికెట్ అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com