Sunday, April 20, 2025

13 మంది డీఎస్పీలకు ప్రమోషన్​

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పనిచేస్తున్న డీఎస్పీలకు అడిషనల్‌ ఎస్పీలు గా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ విభాగంలో డీఎస్పీలుగా పనిచేస్తున్న కె శంకర్‌, డి. ఉపేంద్రా రెడ్డి, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న బి. ప్రతాప్‌కుమార్‌, ఎ.విశ్వప్రసాద్‌, ఏసీబీలో డీఎస్పీలుగా పనిచేస్తున్న బి. శ్రీకృష్ణాగౌడ్‌, డి.కమలాకర్‌రెడ్డికి అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అంబర్‌పేటలోని పీటీసీలో డీఎస్పీలుగా పనిచేస్తున్న జి.వెంకటేశ్వర బాబు,పిచ్చయ్య, ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న జె. నర్సయ్య, నిజామాబాద్‌లోని సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న బి. కిషన్‌కు అడిషనల్‌ ఎస్పీలుగా ప్రమోషన్‌ కల్పించారు. హైదరాబాద్‌లోని టీజీపీఏలో ఉన్న ఎండీ.మాజిద్‌, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డీఎస్పీగా పనిచేస్తున్న జి. బస్వారెడ్డి, సైబరాబాద్‌ సీఐ సెల్‌లో ఏసీపీ ఉన్న కె.పుల్లయ్యకు అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతులు కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన అధికారులంతా 15 రోజుల్లో డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని రవిగుప్తా ఆదేశించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com