Wednesday, May 7, 2025

రాష్ట్రంలో 13 లక్షల పోస్టల్ బ్యాలెట్ పత్రాలు

  • ఈనెల 30 నుంచి వచ్చే 2 వరకు పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో 13 లక్షల పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ముద్రించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 85 సంవత్సరాల వయస్సు దాటిన వయోవృద్ధులు 4.50 లక్షల మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే దివ్యాంగ ఓటర్లు సుమారు 5 లక్షల మంది నమోదయ్యారు. ఎన్నికల విధుల్లో సుమారు 2.60 లక్షల మంది ఉద్యోగులు భాగస్వాములు కానున్నారు. అలాగే రాష్ట్రానికి చెందిన 15 వేలమందికిపైగా సిబ్బంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులను నిర్వహిస్తున్నారు.

వారికి రిజిస్టర్ పోస్టు ద్వారా పోస్టల్ బ్యాలెట్ పంపనున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కోసం దివ్యాంగులు, వయోవృద్ధులు 12డీ దరఖాస్తు ఫారం నింపి రిటర్నింగ్ అధికారి అందించాల్సివుంది.

అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మే 3వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించి ఎనిమిదో తేదీలోగా పూర్తి చేయానున్నారు. సాధారణ పోలింగ్ తేదీ కంటే నాలుగు రోజుల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 30 నుంచి పోస్టల్ బ్యాలెట్ ముద్రణ ప్రారంభించి మే 2వ తేదీలోగా పూర్తి చేయనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com