Sunday, November 17, 2024

వంతెనపై వేలాడుతూనే 100కు డయల్‌ చేసిన 13 ఏళ్ల బాలిక‌

ప్రాణం పోయే స్థితిలో ధైర్యంగా ఫోన్‌ చేసిన 13ఏళ్ల బాలిక
ఇద్దరు పిల్లలు సహా మహిళను గోదాట్లోకి తోసేసిన ప్రియుడు
తల్లి, చెల్లి కొట్టుకుపోయినా.. పైప్‌ పట్టుకుని ఆగిన బాలిక
పోలీసులు రావడంతో దక్కిన ప్రాణాలు

ఓపక్క ప్రాణాలు పోతాయన్న భయం… మరోపక్క తల్లి, చెల్లి గోదావరిలో కొట్టుకుపోయారన్న బాధ.. చిమ్మచీకటిలో వంతెనపై వేలాడుతూ.. తాను బతుకుతానో లేదో అన్న ఆవేదన.. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా జీవితంపై ఆశలు వదిలేసుకుంటారు! కానీ.. గుండెల నిండా ధైర్యం నింపుకొన్న 13 ఏళ్ల బాలిక సమయస్ఫూర్తితో ఆలోచించి 100కు డయల్‌ చేసి ప్రాణాలు దక్కించుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్న ఉలవ సురేశ్‌తో పుష్పాల సుహాసిని (35) అనే మహిళ సహజీవనం చేస్తోంది. వీరి కుమార్తెలు జెర్సీ (1), పదమూడేళ్ల లక్ష్మీకీర్తన. ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో వారిని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి పాత వంతెన వద్దకు తీసుకెళ్లిన సురేశ్‌.. ఆ ముగ్గురినీ వంతెనపై నుంచి గోదాట్లోకి తోసేశాడు. సుహాసిని, జెర్సీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా లక్ష్మీకీర్తన బ్రిడ్జి గోడకు అడుగున ఉన్న పైపు పట్టుకుని ఆగింది. ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు 100కు డయల్‌ చేయాలనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే తన సెల్‌ఫోన్‌ నుంచి 100కు డయల్‌ చేసి రక్షించాలని కోరింది. వెంటనే స్పందించిన ఎస్‌ఐ వెంకటరమణ నేషనల్‌హైవే సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాపకు ధైర్యం చెబుతూ ఆమెను కాపాడారు. అంతటి విపత్కర పరిస్ధితుల్లోనూ ధైర్యం కూడగట్టుకుని సెల్‌ఫోన్‌ సాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న ఆలోచన చేసిన లక్ష్మీకీర్తన ధైర్యాన్ని పలువురు కొనియాడారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular