Sunday, November 17, 2024

ఇజ్రాయెల్‌ లో 15 వేల ఉద్యోగాలు..2 లక్షల జీతం,ఇతర సౌకర్యాలు

ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా కార్మికుల కొరత ఎదుర్కొంటోంది. పలు రంగాల్లో కార్మికుల కొరతతో సతమతమవుతోంది. ఈ క్రమంలో భారత్‌ నుంచి వేల సంఖ్యలో నియామకాలు చేసుకునేందుకు రంగం సిద్దంచేస్తోంది ఇజ్రాయెస్. తమ దేశంలో కార్మికులను నియమించుకునేందుకు ఇజ్రాయెల్.. భారత్‌ ను సంప్రదించిందని నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తెలిపింది. ఇందులో భాగంగా మొదటి దశలో సుమారు 10 వేల నిర్మాణ కార్మికులు, ఐదు వేల ఆరోగ్య సంరక్షకులను నియమించుకోనున్నట్లు పేర్కొంది.

తాత్కాలిక ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇజ్రాయెల్‌-భారత్‌లు 2023 లో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టింది ఇజ్రాయెల్. మరీ ముఖ్యంగా భవన నిర్మాణానికి సంబందించిన ఫ్రేమ్‌ వర్క్‌, ఐరన్‌ బెండింగ్‌, ప్లాస్టరింగ్‌, సిరామిక్‌ టైలింగ్‌ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఇజ్రాయెల్‌కు చెందిన పాపులేషన్‌, ఇమ్మిగ్రేషన్‌, బార్డర్‌ అథారటీ ఇటీవల మరోసారి సంప్రదించిందని నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తెలిపింది. ఇదివరకు తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల నుంచి 10,349 నిర్మాణ కార్మికులను నియమించుకున్న ఇజ్రాయెల్‌, ఈసారి మహారాష్ట్రలో వీటి నియామకాలు చేపడుతోంది.

ఈ నియామకాలకు సంబంధించి స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు త్వరలోనే ఇజ్రాయెల్‌ పాపులేషన్‌, ఇమ్మిగ్రేషన్‌, బార్డర్‌ అథారటీ భారత్‌ కు రానుందని అధికారులు చెప్పారు. నిర్మాణ రంగంలోనే కాకుండా వైద్య రంగంలో ఐదు వేల వైద్య సంరక్షకులను ఇజ్రాయెల్‌ నియమించుకోనుంది. ఇందుకు 10వ తరగతి విద్యార్హత, వైద్య సంరక్షణ కోర్సు పూర్తి చేసి ఉండాలి. కనీసం 990 గంటల పాటు సంబంధిత విభాగంలో శిక్షణ పొందిన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌ఎస్‌డీసీ వెల్లడించింది. నిర్మాణరంగానికి సంబందించి ఎంపికైన వారికి నెలకు 1.92 లక్షల రూపాయల జీతంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు. వీటితో పాటు 16,515 రూపాయల బోనస్‌ సైతం చెల్లిస్తారని అధికారులు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular